Political News

అమ‌రావ‌తిపై చ‌ర్చ‌.. రాజ్య‌స‌భ‌లో దుమ్మురేపిన నాయుడు

అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లును బుధ‌వారం లోక్‌స‌భ ఆమోదించిన ద‌రిమిలా.. రాజ్య‌స‌భ‌లో గురువారం ప్ర‌వేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ స‌హాయ‌ మంత్రి నిత్యానంద‌రాయ్‌.. దీనిని స‌భ‌కు స‌మ‌ర్పించారు. అనంత‌రం.. చైర్మ‌న్ సీపీ రాధాకృష్ణ‌న్‌.. చ‌ర్చ‌కు అనుమ‌తించారు. తొలుత టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు ఈ చ‌ర్చ‌ను ప్రారంభించారు. త‌న‌దైన శైలిలో ఆయ‌న స‌భ‌లో దుమ్మురేపారు.

రాజ‌ధానికి సంబంధించి పూర్వాప‌రాల‌తో పాటు.. చంద్ర‌బాబు-జ‌గ‌న్ ప్ర‌భుత్వాల హ‌యాంలో రాజ‌ధాని ప‌రిస్థితి.. ఇప్పుడు ఏం జ‌రుగుతోంది?  భవిష్య‌త్తులో ఏం జ‌రుగుతుంది.. ఇలా.. అన్ని అంశాల‌ను కూలంకషంగా వివ‌రించారు. రాష్ట్ర విభ‌జ‌న‌ను స‌మ‌ర్ధిస్తూనే.. కానీ.. విభ‌జ‌న జ‌రిగిన తీరును తీవ్రంగా విభేదించారు. రాజ‌ధాని లేకుండా రాష్ట్రాన్ని విడ‌గొట్టార‌ని.. పైగా 16 వేల కోట్ల‌రూపాయ‌ల లోటు బ‌డ్జెట్‌తో రాష్ట్రాన్ని విడ‌దీశార‌ని తెలిపారు.

దీంతో ప్ర‌జ‌లు అపార అనుభ‌వం ఉన్న సీఎం చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం పెట్టుకుని 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌నను ముఖ్య‌మంత్రిని చేశార‌ని తెలిపారు. ఏ రాష్ట్రానికైనా ఒక రాజ‌దాని ఉంటుంద‌ని.. అది కూడా న‌దుల స‌మీపంలోనే ఉంటుంద‌ని పేర్కొన్న రామ్మోహ‌న్ నాయుడు.. ఈ క్ర‌మంలోనే అన్నీ ఆలోచించి కృష్ణాన‌ది ప‌క్క‌న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి అంకురార్ప‌ణ చేశారని తెలిపారు. రైతుల‌ను మెప్పించి.. 33 వేల ఎక‌రాల‌కు పైగా భూములు స‌మీక‌ర‌ణ విధానంలో తీసుకున్నార‌ని పేర్కొన్నారు.

అభివృద్ధి జ‌రుగుతున్న క్ర‌మంలో వైసీపీ ప్ర‌భుత్వం స‌ర్వంనాశ‌నం చేసింద‌ని రామ్మోహ‌న్ గుర్తు చేశారు. దీనికి సంబంధించి రైతులు ఉద్య‌మం చేసి.. రాజ‌ధానిని నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా.. దానిపైనా వైసీపీ ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపింద‌ని తెలిపారు. మ‌రోసారి ప్ర‌జ‌లు చంద్ర‌బాబుపై ఉన్న విశ్వాసం తోనే గెలిపించార‌ని.. ఈ క్ర‌మంలో ఇప్పుడు రాజ‌ధానిని నిలబెట్టేందుకు.. `దుష్ట‌శ‌క్తుల‌` నుంచి రాజ‌ధానిని ర‌క్షించేందుకు అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించేందుకే.. చంద్ర‌బాబు పూనుకొన్నార‌ని తెలిపారు. ఇది చ‌రిత్ర‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంద‌న్నారు.

This post was last modified on April 2, 2026 5:59 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

35 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago