Political News

తెలంగాణ అసెంబ్లీలో ఏమిటీ ‘రాఘవ’ రచ్చ?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శనివారం అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య పెను వివాదమే రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై చర్చ జరగగా… మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్ నగరం నడిబొడ్డునే పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ కు పాల్పడుతోందన్న ఆరోపణ వినిపించినంతనే సభలో గందరగోళం నెలకొంది. రాఘవ కన్ స్ట్రక్షన్ పేరును బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రస్తావించారు. అంతేకాకుండా ఈ కంపెనీ పొంగులేటికి చెందినదేనని ఆయన చేసిన ఆరోపణతో అధికార పక్షం ఘాటుగా స్పందించింది. 

రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీ హైదరాబాద్ నగరం నడిబొడ్డున పెద్ద ఎత్తున అక్రమంగా మైనింగ్ చేపడుతోందని హరీశ్ రావు ఆరోపించారు. ఈ కంపెనీ మంత్రి పొంగులేటిదేనని కూడా ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ లు ఘాటుగానే స్పందించారు. పొంగులేటి ఆ కంపెనీలో కనీసం డైరెక్టర్ గా కూడా లేరని, అలాంటప్పుడు ఆ కంపెనీ పొంగులేటిదేనని ఎలా చెబుతారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు.

అంతేకాకుండా అసత్య ఆరోపణలు చెబుతున్న హరీశ్ రావు తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత మైకందుకున్న మైనింగ్ శాఖ మంత్రి వివేక్… బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో చాలా చోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని తెలిపారు. వాటన్నింటిపైనా విచారణకు సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు.

మంత్రుల సవాళ్లతో మరింతగా స్వరం పెంచిన హరీశ్ రావు… రాఘవ పేరు వేరెవరిదో కాదని, సాక్షాత్తు పొంగులేటి తండ్రి గారి పేరే రాఘవ అని… ఆ పేరు మీదే పొంగులేటి కంపెనీ పెట్టుకున్నారని విమర్శించారు. అంతేకాకుండా… రాఘవ కన్ స్ట్రక్షన్ పై తాను సోషల్ మీడియాలో పోస్టులు పెడితే…మంత్రి హోదాలో ఉన్న పొంగులేటి తనపై విరుచుకుపడ్డారని గుర్తు చేశారు.

ఆ కంపెనీ తనది కాపోతే… మంత్రి గారు తనపై అంతగా ఎందుకు ఎగిరిపడతారని, తనపై అసభ్యకర వ్యాఖ్యలు ఎందుకు చేస్తారని హరీశ్ రావు ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ రాఘవ కన్ స్ట్రక్షన్ తో పాటు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమ మైనింగ్ పైనా విచారణకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ విచారణను సీబీసీఐడీ చేపడుతుందని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆ నివేదికలను సభలో పెడతామని సీఎం తెలిపారు.

This post was last modified on March 28, 2026 6:14 pm

Share

Recent Posts

అనిరుధ్ మీద ఎన్నడూ లేనంత నెగెటివిటీ

ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఎక్కువమంది చెప్పే పేరు.. అనిరుధ్ రవిచందర్‌దే. పేరుకు తమిళ…

34 minutes ago

ఇలాగైతే లోకేష్ ను వైసీపీ ఓడించినట్టే

రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్, విద్యా శాఖ మంత్రి నారా…

38 minutes ago

దసరా బరిలో ఎవరికి ఎక్కువ లాభం

ఇంకో రెండు వారాల్లో దసరా పండగ రానుంది. సెలవుల సీజన్ కావడంతో పిల్లా పెద్ద అందరూ ఎదురు చూస్తున్నారు. బయ్యర్…

1 hour ago

ఏఐ సినిమా… ఫోన్లో చూసి మురిసిపోవడమే

మొన్నటిదాకా ఇండస్ట్రీలో ఒకటే గుసగుస. ఏఐ వచ్చేసిందిగా, ఇకపై గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలేయాల్సిన పనేముంది అని చాలామంది లెక్కలేసుకున్నారు.…

2 hours ago

‘స్లమ్ డాగ్’ సౌండ్ ఎప్పుడు వినపడుతుంది

దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న…

2 hours ago

జ‌గ‌న్‌కు ప‌ట్ట‌లేదు… లోకేష్ ప‌ట్టించుకున్నారు

వైసీపీ అధినేత జ‌గ‌న్ నివాసం ఉండే తాడేప‌ల్లి ప్రాంతం.. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటుంది. ఇక్క‌డ అనేక మంది పేద‌లు.. దిగువ…

3 hours ago