ఏపీలో విపక్ష వైసీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటే ఫైనల్ అని, పార్టీలోని ఏ ఒక్క నేత కూడా ఆయన మాటకు అడ్డు చెప్పే పరిస్థితే లేదని ఓ రేంజిలో ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మాట ఎంతమాత్రం నిజం కాదని తాజాగా తేలిపోయింది. ఆయా అంశాలపై జగన్ తీసుకున్న నిర్ణయాలను ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలు అడ్డుకునే యత్నం చేశారట.
అంతేకాదండోయ్.. ఆయా అంశాలపై తన నిర్ణయాలను జగన్ వెనక్కు తీసుకునే దిశగా ఆయా నేతలు చాలానే యత్నించారట. అయితే జగన్ వైఖరి తెలిసి…ఎంతదాకా వ్యతిరేకించాలో.. అంతదాకానే వ్యతిరేకించి ఆపై మౌనంగా ఉండిపోయారట. ఈ విషయాలు ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తెలిసి వచ్చింది.
ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి ఆమోదం తెలిపేందుకు శనివారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో తీర్మానాన్ని సభా నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించగా… ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మంత్రులు, పలువురు కూటమి పార్టీలకు చెందిన నేతలు మాట్లాడారు.
అందులో భాగంగా గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగి… ఆ తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన వసంత కృష్ణ ప్రసాద్ కీలక ప్రసంగం చేశారు. నాడు వైసీపీలో ఉన్నవారినంతా ఇతర పార్టీలు రాక్షసులుగా అబివర్ణించిన తీరును ఆయన ప్రస్తావించారు.
లంకలో ఉన్న వాళ్లంతా రాక్షసులన్నట్లుగా వైసీపీలో ఉన్నవాళ్లంతా రాక్షసులేనని విమర్శలు విని తాను ఎంతగానో బాధపడ్డానని ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు జగన్ మూడు రాజధానుల అంశాన్ని ఎత్తుకోగా… ఆ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని చెప్పారు.
తనతో పాటు నాడు ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ పీనియర్ నేత మల్లాది విష్ణు కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారని ఆయన చెప్పారు. ఈ నిర్ణయం పార్టీకి నష్టం చేస్తుందని తాము ఎంతగా చెప్పినా.. జగన్ వినిపించుకోలేదన్నారు. అయితే తన నిర్ణయానికి వ్యతిరేకంగా సాగే నేతలను జగన్ ఏం చేస్తారో అందరికీ తెలిసిందేనని చెప్పిన కృష్ణ ప్రసాద్… ఎంతదాకా వ్యతిరేకించాలో అంతదాకా మాత్రమే తాము ముందుకు వెళ్లామని, ఆపై ఏం జరుగుతుందో తెలిసి మిన్నకుండిపోవాల్సి వచ్చిందని చెప్పారు.
This post was last modified on March 28, 2026 5:35 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…