తొమ్మిదేళ్ల కిందట ‘బాహుబలి: ది కంక్లూజన్’ బాక్సాఫీస్ దగ్గర మామూలు ప్రభంజనం సృష్టించలేదు. అప్పటిదాకా ఉన్న అన్ని ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులనూ ఆ సినిమా బద్దలు కొట్టేసింది. ఐతే ‘దంగల్’ సినిమాను చైనాలో రిలీజ్ చేయడం ద్వారా.. ఆ సినిమా ఓవరాల్ వసూళ్ల రికార్డును బద్దలు కొట్టేయగలిగారు. ఆపై బాహుబలి-2 పేరిట ఉన్న వేరే రికార్డులు ఒక్కొక్కటిగా బద్దలవుతూ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘బాహుబలి-2’ రికార్డులన్నీ చెరిగిపోయాయి.
కానీ యుఎస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రాజమౌళి సినిమా నెలకొల్పిన రికార్డును మాత్రం మరే చిత్రం అధిగమించలేకపోయింది. ఇండియాలో అంటే టికెట్ల ధరలు పెరగడం, మార్కెట్ పరిధి విస్తరించడం వల్ల ‘బాహుబలి-2’ రికార్డులను వేరే సినిమాలు అధిగమించగలిగాయి కానీ.. యుఎస్‌లో కలెక్షన్లను డాలర్లలో కొలుస్తారు కాబట్టి ఆ సినిమా వసూళ్లను దాటడం మిగతా చిత్రాలకు చాలా కష్టమైంది.
‘బాహుబలి-2’ యుఎస్‌లో 22 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం విశేషం. రెండేళ్ల ముందు ప్రభాస్ ‘కల్కి’ చిత్రం ‘బాహుబలి-2’ రికార్డుకు చేరువగా వచ్చి ఆగిపోయింది. ఆ చిత్రం 18.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఐతే గత ఏడాది ‘దురంధర్’ చిత్రం ‘బాహుబలి-2’ను బీట్ చేసేలా కనిపించింది కానీ.. అది కూడా ఫుల్ రన్లో 20.65 మిలియన్ డాలర్ల దగ్గర ఆగింది. కానీ ‘దురంధర్-2’ మాత్రం పక్కాగా ‘బాహుబలి-2’ను బీట్ చేసేలా కనిపిస్తోంది.
ఈ సినిమా తొమ్మిది రోజుల్లోనే నార్త్ అమెరికాలో 19 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి లాంగ్ రన్ ఉండబోతోందన్నది స్పష్టం. కాబట్టి ఇంకొన్ని రోజుల్లో బాహుబలి-2ను అధిగమించడం లాంఛనమే. సెకండ్ వీకెండ్ అయ్యేసరికే ‘బాహుబలి-2’ రికార్డు బద్దలైనా ఆశ్చర్యం లేదు. మొత్తానికి యుఎస్‌లో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా తొమ్మిదేళ్ల పాటు ‘బాహుబలి: ది కంక్లూజన్’ పేరిట ఉన్న రికార్డును ‘దురంధర్: ది రివెంజ్’ బద్దలు కొట్టబోతోందన్నమాట.
This post was last modified on March 28, 2026 5:35 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…