Political News

ఆళ్లగడ్డలో మళ్లీ లొల్లి… ఈ సారి ‘కేబుల్’ వార్

రాయలసీమలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానముంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఏళ్ల తరబడి సాగిన ఫ్యాక్షన్ రాజకీయాలు ఆళ్లగడ్డకు ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే గంగుల కుటుంబంలోని ఓ వర్గం పూర్తిగా రాజకీయాలకు దూరం కావడం, భూమా నాగిరెడ్డి దంపతుల మరణం తర్వాత అక్కడ ఫ్యాక్షన్ కు తెర పడిపోయింది. అయితే ఇప్పుడు అధికార టీడీపీలోనే ఇద్దరు కీలక నేతల మధ్య నిత్యం వివాదాలు రేగుతున్నాయి. ఇప్పటికే ఈ తరహా వివాదాలు లెక్కలేనన్ని జరగగా.. తాజాగా కేబుల్ టీవీ ప్రసారాలకు సంబంధించిన వివాదం కొత్తగా తెర మీదకు వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ… భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య నెలకొన్న వివాదంతో ఆళ్లగడ్డలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భూమా నాగిరెడ్డి బతికి ఉండగా…భూమా ఫ్యామిలీకి అత్యంత నమ్మకస్తుడిగానే కాకుండా దాదాపుగా అన్ని వ్యవహారాలను పర్యవేక్షించే సుబ్బారెడ్డి… నాగిరెడ్డి మరణంతో ఆ ఫ్యామిలీకి దూరమైపోయారు. నాగిరెడ్డి రాజకీయ వారసత్వం అందిపుచ్చుకున్న అఖిలప్రియతో సుబ్బారెడ్డికి అస్సలు పడటం లేదు. ప్రతి చిన్న విషయంలో సుబ్బారెడ్డిని నిలువరించే దిశగా అఖిల సాగుతుండగా… తానేమీ తక్కువ తినలేదన్నట్లుగా సుబ్బారెడ్డి ఎదురు తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అఖిల, సుబ్బారెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారిపోయాయి. అఖిల భర్త వ్యవహారం కారణంగానే భూమా ఫ్యామిలీకి దూరమయ్యారన్న వాదనలు లేకపోలేదు. ఇలాంటి క్రమంలో తాజాగా కేబుల్ టీవీ ప్రసారాలకు సంబంధించిన వివాదం ఈ రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టింది.

ఆళ్లగడ్డలో కేబుల్ టీవీ ప్రసారాలు ఏళ్లుగా సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. నంద్యాల కేబుల్ నెట్ వర్క్స్ పేరిట సుబ్బారెడ్డి వర్గం ఆళ్లగడ్డలోని కేబుల్ ప్రసారాలను నిర్వహిస్తోంది. తాజాగా అఖిల వర్గానికి చెందిన వారు ఎస్ఎస్ వీ కేబుల్ నెట్ వర్క్ పేరిట కొత్తగా కేబుల్ సేవలను ఆళ్లగడ్డలో ప్రారంభించారు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి కేబుల్ నెట్ వర్క్ లోని కనెక్షన్లు అఖిల వర్గం నెట్ వర్క్ లోకి మారుతున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా సుబ్బారెడ్డి నెట్ వర్క్ కు చెందిన కేబుల్ వైర్లను కూడా అఖిల వర్గం కట్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇదే విషయాన్ని బయటపెట్టిన సుబ్బారెడ్డి…. తన ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని మండిపడుతన్నారు. ఎప్పటి నుంచో తాను కేబుల్ సర్వీసులను అందిస్తూ ఉంటే… ఇప్పుడు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కేబుల్ సర్వీసులతో తనకు నష్టం జరుగుతోందని, దీనిని సహించేది లేదని ఆయన హెచ్చరించారు. మొత్తంగా కేబుల్ ప్రసారాల అంశం ఆళ్లగడ్డలో మరో కొత్త లొల్లికి కారణంగా నిలుస్తోంది.

This post was last modified on March 27, 2026 1:52 pm

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

3 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

5 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

6 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

7 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

8 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

8 hours ago