Movie News

తెలుగు దురంధర్ అంచనాలు అందుకోలేదా?

కేవలం ఎనిమిది రోజులకే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన దురంధర్ ది రివెంజ్ ఇప్పట్లో నెమ్మదించేలా లేదు. వివిధ భాషల్లో నిన్న ఈ రోజు విడుదలైన కొత్త సినిమాలు ఏమంత చెప్పుకునే స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోకపోవడంతో రణ్వీర్ సింగ్ మూవీకి మరో పెద్ద ఛాన్స్ దొరికింది. అయితే ఏపీ తెలంగాణకు సంబంధించి డబ్బింగ్ వెర్షన్ మరీ తీవ్రమైన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదని ట్రేడ్ టాక్. ప్రస్తుతం పాతిక కోట్ల నెట్ తో స్టడీగా ఉందని, వీకెండ్ నుంచి పికప్ ఉంటుందని బయ్యర్లు భావిస్తున్నారు.

దీనికి కారణాలు లేకపోలేదు. దురంధర్ 2 తెలుగు డబ్బింగ్ రెండు రోజులు ఆలస్యంగా వచ్చింది. ప్రీమియర్లతో సహా ఫస్ట్ టూ డేస్ అమ్మిన అడ్వాన్ టికెట్ల డబ్బులు వెనక్కు ఇచ్చారు. విసుగు చెందిన అధిక శాతం ప్రేక్షకులు హిందీ వెర్షన్ చూసేశారు. దీంతో కొంత డ్యామేజ్ జరిగింది. అయినా సరే భాష అర్థం కాక ఎదురు చూసిన ఆడియన్స్ నిరీక్షణ మొదటి శనివారం ఫలిచింది. వీకెండ్ అడ్డు అదుపు లేకుండా దురంధర్ రివెంజ్ దూసుకుపోయిన మాట వాస్తవం.

ప్లానింగ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఉదంతాన్ని బట్టి చెప్పొచ్చు. ఒకవేళ హిందీతో పాటు సమాంతరంగా తెలుగు కూడా రిలీజై ఉంటే లెక్కలు వేరుగా ఉండేవి. ఇప్పటికైనా మించిపోలేదు కానీ ఒకటి ఒప్పుకోవాలి. ఒక బాలీవుడ్ డబ్బింగ్ మూవీకి ఇంత మొత్తం వసూలు కావడం, అది కూడా ఫస్ట్ పార్ట్ అనువాదం తెలుగులోకి రాకుండానే జనంలో ఇంత అటెన్షన్ తెచ్చుకోవడం చిన్న విషయం కాదు. కాంతార లాగా అన్నీ ఒకేసారి చేసి ఉండాల్సింది.

నెక్స్ట్ దురంధర్ ది రివెంజ్ ఏ మైలురాయి దగ్గరికి వెళ్తుందనే దాని మీద బయ్యర్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు వేల కోట్లను పక్కాగా దాటుతుందని నిర్మాతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దానికి తగ్గట్టే ఏ సెంటర్స్ లో ఈ సినిమా ర్యాంపేజ్ మాములుగా లేదు. పుష్ప 2ని క్రాస్ చేస్తుందా లేదానే దాని మీద ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నారు. విఎఫ్ఎక్స్, ఫాంటసీ లేని ఒక గ్యాంగ్ స్టర్ కం మాఫియా స్పై డ్రామా ఈ స్థాయిలో అరాచకం సృష్టించడం నభూతో నభవిష్యత్.

This post was last modified on March 27, 2026 12:15 pm

Share

Recent Posts

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

27 minutes ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

1 hour ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

3 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

3 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

3 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

5 hours ago