Political News

తిరుమలలో లడ్డూ నాణ్యతపై సీఎం బాబు ఆరా

త‌న మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్క‌రించుకుని సీఎం చంద్ర‌బాబు, భువ‌నేశ్వ‌రి దంప‌తులు.. శ‌నివారం ఉదయ‌మే తిరుమల శ్రీవారి ద‌ర్శనం చేసుకున్నారు. అనంత‌రం.. శ్రీవారి ప్ర‌సాదాన్ని రుచి చూశారు. ఆ త‌ర్వాత‌.. ఫ్యామిలీ అంతా గెస్ట్ హౌస్‌కు వెళ్లిపోగా.. సీఎం చంద్ర‌బాబు స‌హా తిరుమ‌ల బోర్డు చైర్మ‌న్ నాయుడు, అధికారుల‌తో కలిసి.. ఆయ‌న క్యూలైన్ల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా తిరుమల మాడ వీధుల్లో ద‌ర్శ‌నం ముగించుకుని బ‌య‌టకు వ‌చ్చిన భ‌క్తుల‌తో చంద్ర‌బాబు మాట్లాడారు. “ఏమ్మా తిర‌మ‌ల ల‌డ్డూ తిన్నావా.. ఎలా ఉంది?“ అంటూ.. ప‌లువురు మ‌హిళ‌ల‌ను ప్ర‌శ్నించారు. దీనికి వారు సంతోషం వ్య‌క్తం చేశారు. చాలా బాగుంద‌ని, నాణ్యంగా ఉంద‌ని స‌మాధానం ఇచ్చారు. అంతేకాదు.. గ‌తంతో పోలిస్తే.. ఇప్పుడు నాణ్య‌త చాలా బాగుంద‌ని రెగ్యుల‌ర్ భ‌క్తులు కొంద‌రు చెప్పారు. అనంత‌రం.. అన్న‌దాన స‌త్రాన్ని కూడా చంద్ర‌బాబు ప‌రిశీలించారు.

అయితే.. భ‌క్తుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో వారికి వెయిటింగ్ స‌మ‌యాన్ని త‌గ్గించాల‌ని చంద్ర‌బాబు సూచించారు. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మంది శ్రీవారిని ద‌ర్శించుకునేలా కృత్రిమ మేధ‌ను విని యోగించుకోవాల‌ని సూచించారు. టెక్నాలజీని వినియోగించుకుని.. క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరిం చాల‌ని తెలిపారు. అదేవిధంగా భ‌ద్ర‌త‌కు ఎక్కువ‌గా ప్రాధాన్యం ఇవ్వాల‌ని.. అన్య‌మ‌త ధోర‌ణుల‌కు అవ‌కాశం ఇవ్వ‌రాద‌ని కూడా అధికారుల‌కు తేల్చి చెప్పారు.

This post was last modified on March 21, 2026 9:27 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago