Movie News

సురేందర్ రెడ్డి రిస్కు తీసుకోవాల్సిందే

గబ్బర్ సింగ్ కాంబో కాబట్టి అదే స్థాయిలో మేజిక్ చేస్తుందని ఆశించిన అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ లో వాళ్ళు సంతోషపడేలా ఫ్యాన్ కంటెంట్ అయితే దొరికింది. కానీ సాధారణ ప్రేక్షకులకు నచ్చే అంశాలు తక్కువగా ఉండటంతో ఆశించిన పెద్ద స్థాయిలో బాక్సాఫీస్ రన్ లేదన్నది వాస్తవం. వీకెండ్ లో అనూహ్యమైన పికప్ అందుకుని మేజిక్ చేస్తుందనే ఆశతో బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. కాకపోతే దురంధర్ ది రివెంజ్ రూపంలో పెద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది.

దీని సంగతలా ఉంచితే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డితో లాకైన సంగతి తెలిసిందే. ఇది కూడా మూడేళ్లుగా స్క్రిప్ట్ స్టేజిలో ఉంది. ఫైనల్ గా నిర్మాత రామ్ తాళ్ళూరికి రిలీఫ్ కలిగిస్తూ పవన్ డేట్స్ ఇచ్చారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడనేది చెప్పలేదు కానీ ప్రస్తుతం పవర్ స్టార్ మైంటైన్ చేస్తున్న లుక్, హెయిర్ స్టైల్ ఈ మూవీ కోసమేనని యూనిట్ టాక్. అయితే సురేందర్ రెడ్డి గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి.

కేవలం ఫ్యాన్ స్టఫ్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేం. బలమైన కథ ఉండాల్సిందే. మన శంకరవరప్రసాద్ గారులో అనిల్ రావిపూడి ఎంత వింటేజ్ చిరంజీవిని వాడుకున్నా ఎమోషన్, సెంటిమెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫలితంగా చిరు పిల్లల ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయ్యింది. ఓజిలో ఎలివేషన్లతో పాటు ప్రాపర్ గ్యాంగ్ స్టర్ స్టోరీని ప్రెజెంట్ చేయడం వల్లే సుజిత్ అంత పెద్ద హిట్టు ఇవ్వగలిగాడు. సో బేసిక్స్ అనేవి చాలా అవసరం.

ఎందుకు రిస్క్ అని సురేందర్ రెడ్డి కనక రొటీన్ ఎలిమెంట్స్ తో పవన్ ని చూపిస్తే ఇబ్బందవుతుంది. అసలే ఏజెంట్ డిజాస్టర్ ప్రభావం తన మీద గట్టిగా ఉంది. సైరా నరసింహారెడ్డిని అందరిని మెప్పించేలా తీర్చిదిద్దలేదనే కంప్లయింట్ కూడా ఉంది. ముందు ఈ ముద్ర తుడిచిపెట్టుకుపోయేలా ఒకప్పటి కిక్, రేసు గుర్రం నాటి ఫిలిం మేకర్ ని సురేందర్ రెడ్డి బయటికి తీయాలి. ఇప్పటికైతే కథ చాలా బాగా వచ్చిందని ఇన్ సైడ్ టాక్. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే సూచనలున్నాయి.

This post was last modified on March 21, 2026 7:32 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

29 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago