బీఆర్ఎస్ నాయకుడు, మాటల తూటాలను తనదైన శైలిలో ఎటైనా తిప్పగల నేర్పరిగా పేరొందిన నేత.. అన్నింటికీ మించి `అందరివాడు`గా గుర్తింపు పొందిన మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ నుంచి మరో నేత రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు రెడీగా ఉన్నట్టు పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
వచ్చే ఎన్నికల నాటికి మల్లారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కోడలు, ప్రస్తుతం మల్లారెడ్డి విద్యాసంస్థలకు డైరెక్టర్‌గా ఉన్న ప్రీతి రాజకీయ రంగంలోకి వస్తున్నట్టు పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. అంతేకాదు.. ఆమె తరచుగా ఆన్ లైన్ మీడియా ఛానెళ్లకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో కేవలం విద్య, ఆర్థికం, మహిళల అభ్యున్నతే కాదు.. రాజకీయ పరమైన అనేక అంశాలను కూడా ప్రీతిరెడ్డి ప్రస్తావిస్తున్నారు. తనకు ఉన్న విజన్‌ను కూడా ఆవిష్కరిస్తున్నారు.
పేదలు ఇంకా పేదలుగా ఉండడాన్ని ఆమె తప్పుబడుతున్నారు. తన దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయని ప్రీతి చెబుతున్నారు. సో.. తద్వారా ఆమె రాజకీయ ఎంట్రీ విషయంపై పరోక్షంగా చెబుతున్నారు. ఇక, ఈ వీడియోలు, ఇంటర్వ్యూలు హల్ చల్ చేస్తున్నా.. ఎక్కడా కూడా మల్లారెడ్డి తన కోడలు రాజకీయ ఎంట్రీ ఇవ్వబోదని.. ఇవన్నీ.. వ్యక్తిగతమని చెప్పడం లేదు. సో.. దీనిని బట్టి ఆయన కూడా తన ఇంటి నుంచి మరో రాజకీయ నేత రావాలనే కోరుకుంటున్నట్టు అభిప్రాయపడుతున్నారన్నది స్పష్టమవుతోంది. కానీ.. ఇక్కడే చిన్న చిక్కు కనిపిస్తోంది.
మల్లారెడ్డి కోడలు ప్రీతి .. తరచుగా బీజేపీని ప్రస్తావిస్తూ.. ఆ పార్టీపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా మోడీ పాలనను ఆమె హైలెట్ చేస్తున్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని కూడా ఆకాశానికి ఎత్తేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం బలంగా ఉందని.. దేశానికి మంచిపాలన అందిస్తున్నారని కూడా ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.
సో.. ఈ పరిణామాలను బట్టి ఆమె చూపంతా.. బీజేపీవైపు ఉందా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు కాబట్టి.. పైగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న మల్లారెడ్డికి ఇవన్నీ కొట్టిన పిండి. మొత్తానికి ఆమె ఎటు వెళ్తారన్నదికాదు.. రాజకీయాల్లో వస్తున్నారన్నది మాత్రం వాస్తవమేనని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల నాటికి ఆమె రంగంలోకి దిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
This post was last modified on March 15, 2026 5:10 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…