Movie News

కబాలి ద‌ర్శ‌కుడు అద‌ర‌గొట్టేశాడుగా..

త‌న‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నపుడు క‌బాలి, కాలా సినిమాల‌తో నిరాశ‌ప‌రిచాడు కానీ.. పా.రంజిత్ గొప్ప ద‌ర్శ‌కుడ‌న‌డంలో సందేహం లేదు. తొలి రెండు చిత్రాలు అట్ట‌క‌త్తి, మ‌ద్రాస్.. ర‌జినీ సినిమాల త‌ర్వాత తీసిన సార్ప‌ట్ట‌, తంగ‌లాన్ లాంటి చిత్రాల‌తో అత‌ను త‌న స్థాయిని చాటిచెప్పాడు. ప్ర‌తి సినిమాలోనూ ద‌ళిత ఐడియాల‌జీని జొప్పిస్తాడంటూ కొంద‌రు అత‌ణ్ని విమ‌ర్శించినా స‌రే.. పా.రంజిత్ క‌థ‌లు కొత్త‌గా ఉంటాయి, త‌న టేకింగ్ వేరే లెవెల్లో ఉంటుంది.

కాక‌పోతే రంజిత్ పెద్ద క‌మ‌ర్షియ‌ల్ సక్సెస్ అందుకుని మాత్రం చాలా కాల‌మైంది. సార్ప‌ట్ట థియేట‌ర్ల‌లో రిలీజైతే పెద్ద హిట్ట‌య్యేదేమో కానీ.. అది ఓటీటీకి పరిమిత‌మైంది. తంగలాగ్ క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకున్నా.. క‌మ‌ర్షియ‌ల్‌గా అనుకున్నంత ఆడ‌లేదు. ఐతే ఇప్పుడు వెట్టువం అనే క్రేజీ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు.

ఈ సినిమా వ‌ర‌ల్డ్‌ను ప‌రిచ‌యం చేస్తూ తాజాగా రంజిత్ ఒక ప్రోమో వ‌దిలాడు. అది మైండ్ బ్లోయింగ్‌గా ఉండ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరుగుతున్నాయి. త‌మిళనాడు స‌హా కొన్ని రాష్ట్రాల్లో ఫేమ‌స్ అయిన‌ మ‌ల‌కంబ్ ఆట నేప‌థ్యంలో ఈ సినిమాను తీర్చిదిద్దాడు రంజిత్. ఈ ఆట చ‌రిత్ర అంతా త‌వ్వి.. ఆ నేప‌థ్యంలో ఇంటెన్స్ స్టోరీ అల్లిన‌ట్లున్నాడు రంజిత్. ఆర్య‌, శోభిత దూళిపాళ్ల‌, దినేశ్‌, క‌లైయ‌ర‌స‌న్ లాంటి ప్ర‌ధాన పాత్ర‌ధారులు త‌మ పాత్ర‌ల కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో ఈ ప్రోమో చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ప్రోమోలో విజువ‌ల్స్, బీజీఎం, గ్రాండియ‌ర్ అన్నీ ఆక‌ట్టుకున్నాయి. రానా ద‌గ్గుబాటి ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా, తెలుగులో న‌రేట‌ర్‌గా వ్యవహరించడం విశేషం. రూ.25 కోట్ల బడ్జెట్ అంచనాతో మొదలుపెట్టి 75 కోట్లతో పూర్తి చేస్తున్నాడట రంజిత్. ఈ చిత్రానికి నిర్మాతలలో అతను కూడా భాగస్వామి. ఈ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ఖ‌రారు చేయ‌లేదు కానీ.. ఎప్పుడు వ‌చ్చినా సెన్సేష‌న్ క్రియేట్ చేసేలా ఉంది. కాక‌పోతే తెలుగులో వెట్టువుం (వేట అని అర్థం) అని కాకుండా తెలుగు టైటిల్ పెడితే బాగుండేది.

This post was last modified on September 21, 2026 1:26 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

2 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

3 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

4 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

6 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

8 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

9 hours ago