ఇరుముడి థియేటర్ లో విడుదలైనప్పుడు ఒకలా, ఓటిటిలో వచ్చాక మరోలా డిస్కషన్స్ లో నిలుస్తోంది. ముఖ్యంగా ఒక బ్లాక్ బస్టర్ సినిమాకు సోషల్ మీడియాలో నెగటివిటీ కనిపించడం అరుదు. మాస్ మహారాజా మూవీ దాన్ని రుచి చూస్తోంది. బోలెడు తప్పులు, లాజిక్కులు వెతుకుతూ జనాలు శల్య పరీక్ష చేయడం మొదలుపెట్టారు. ఇంతగా ఇందులో ఏముందంటూ ఇంట్లో షోలు చూశాక కామెంట్స్ చేస్తున్న వాళ్ళు వేలల్లో ఉన్నారు. దర్శకుడు శివ నిర్వాణని టార్గెట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చిన ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. చెప్పుకోదగ్గ జనాభా ఉన్న ఊళ్ళో అన్ని హత్యలు జరిగితే కనీసం ఒక కానిస్టేబుల్ కూడా కనిపించడు ఏమిటా అని. స్కూల్లో పాప ఆత్మహత్య, పొదల్లో దొరికిన అమ్మాయి శవం, అజయ్ ఘోష్ కొడుకు మర్డర్, మణమ్మ చావు, ఊరి బయట కుర్రాళ్ళ అకృత్యాలు ఇలా ఎన్ని దారుణాలు జరుగుతున్నా ఒక్క ఖాకీ చొక్కా వస్తే ఒట్టు. ఆడియన్స్ ఫ్లోలో పట్టించుకోలేదు కానీ ఈ విషయాన్ని పాయింటవుట్ చేసిన వాళ్ళు చాలానే ఉన్నారు.
తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ నిర్వాణ దీని గురించి స్పందించారు. ప్రేక్షకులు ఏం అనుభూతి చెందాలని కోరుకున్నానో దాని మీద మాత్రమే దృష్టి పెట్టానని, ఒకవేళ పోలీసులు వస్తే ఆడియన్స్ ఇన్వెస్టిగేటివ్ కోణంలో ఆలోచిస్తే సెంటిమెంట్, ఎమోషన్ పండదని అన్నారు. ఎమ్మెల్యేనే ఈ ఘటనలకు కారణం కాబట్టి ఆయనే ఎవరినీ రానివ్వకుండా చేసి ఉండొచ్చు కదానే యాంగిల్ లో వివరణ ఇచ్చారు. సరే వినడానికి కన్విన్సింగ్ గా ఉన్నా పూర్తిగా ఎస్ అనలేం.
ఎందుకంటే కథ ఏదైనా పోలీసులు వచ్చినంత మాత్రాన జనం కేవలం విచారణ ఎలా చేస్తారనే దాని మీద దృష్టి పెట్టరు. ఆ మాటకొస్తే రంగస్థలంలో రామ్ చరణ్ ని జైల్లో పెట్టి కుళ్ళబొడిచాక ఆది పినిశెట్టి వచ్చి అన్నం తినిపించే సీన్ సినిమాకే హైలైట్ అయ్యింది. అయినా సక్సెస్ కొట్టినప్పుడు లాజిక్స్ పక్కకు వెళ్లిపోతాయి. ఒకవేళ మగధీర ఫ్లాప్ అయ్యుంటే హీరో హీరోయిన్ చేతి వేళ్ళు తాకితే మూడు వందల ఏళ్ళు వెనక్కు వెళ్లడం ఏమిటని కామెడీ చేసేవాళ్ళేమో. హిట్ పడిన చోట తర్కానికి చోటు ఉండదు.
This post was last modified on September 21, 2026 4:06 pm
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…