Political News

మార‌క‌పోతే మార్చేస్తా.. త‌మ్ముళ్ల‌కు బాబు హెచ్చరిక‌

పార్టీ విధానాల‌కు, సిద్ధాంతాల‌కు అనుగుణంగా నాయ‌కులు ప‌నిచేయాల‌ని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు క‌లివిడిగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు టీడీపీ నాయ‌కుల‌కు సూచించారు. నంద్యాల జిల్లాలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. సోమ‌వారం సాయంత్రం పార్టీ నాయ‌కుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా జిల్లాలో పార్టీ నాయ‌కుల వ్య‌వ‌హార‌ తీరుపై ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అదేస‌మ‌యంలో కూట‌మి పార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేద‌ని వ‌స్తున్న నివేదిక‌ల‌ను కూడా వారి ముందు ఉంచి.. ప్ర‌శ్నించారు.

“ఇలా అయితే..ఊరుకునేది లేదు. ఖ‌చ్చితంగా మీరైనా మారాలి. లేదా నేనైనా మారాలి. నేను మార‌డం అంటూ వ‌స్తే.. మీరే ఇబ్బంది ప‌డ‌తారు.“ అని చంద్ర‌బాబు నంద్యాల జిల్లాలోని రెండు నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల‌ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నితీరుపైనా తాను స‌మీక్ష‌లు చేస్తున్నాన‌న్నారు. కొంద‌రు ఎమ్మెల్యేలు సొంత పార్టీనాయ‌కుల‌తోనే గొడ‌వ‌లు ప‌డుతున్నార‌ని.. ఇది పార్టీకి మేలు చేయ‌ద‌ని వ్యాఖ్యానించారు. మ‌రికొంద‌రు మాత్రం బాగానే ప‌నిచేస్తున్న‌ట్టు చెప్పారు. వారిని తాను అభినందిస్తున్నాన‌న్నారు.

ప్ర‌ధానంగా స‌మ‌స్య‌లు ఉంటే పార్టీ దృష్టికి తీసుకురావాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఎవ‌రికి వారు పెత్త‌నం చేయాల‌ని చూస్తే ఊరుకునేది లేద‌ని ఓ మ‌హిళా నాయ‌కురాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. “కుటుంబ త‌గాదాల‌ను మీరు మీరు చూసుకోవాలి. పార్టీకి ఏం సంబంధం?“ అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. వ్య‌క్తిగ‌త అంశాల‌పై రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. మంత్రుల‌తో క‌లివిడిగా ఉండాల‌ని సూచించారు. అంద‌రూ క‌లిసి క్షేత్రస్థాయిలో ప‌నులు చేయాల‌ని.. ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌న్నారు.

ఇక‌, కూట‌మి పార్టీల క‌లివిడి అత్యంత కీల‌క‌మ‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ఈ విష‌యంలో ఎవ‌రు త‌ప్పులు చేసినా.. స‌హించేది లేద‌న్నారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుని.. ఉమ్మడిగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. లేక‌పోతే.. వ్య‌క్తులు న‌ష్ట‌పోవ‌డం త‌ప్ప‌.. పార్టీల‌కు ఎలాంటి న‌ష్టం రాద‌న్నారు. “మీరుమార‌క‌పోతే.. నేనే మార్చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది“ అని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లాలో ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇబ్బందులను నాయ‌కులు స‌మ‌న్వ‌యం చేసుకుని ప‌రిష్క‌రించుకోవాల‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

This post was last modified on March 10, 2026 11:19 am

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

3 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

3 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago