శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని, ఆయనకు ఆ పదవిలో ఉండేందుకు అర్హత లేదని వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చిన పలువురు ఎమ్మెల్సీలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బల్లి కళ్యాణ్ చక్రవర్తి మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు కూడా ఇస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి శుక్రవారం పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది.
నోటీసులకు సంబంధించిన కాపీని సిద్ధం చేయడం, దీనిపై వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఐదుగురు ఎమ్మెల్సీలు సంతకాలు చేయడం, చివరకు ఇది సెక్రటరీ వరకు కూడా వెళ్లడం వంటివి వేగంగా జరిగిపోయాయి. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో ఈ నోటీసుకి సంబంధించిన వ్యవహారం ఆగిపోయింది. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం దీనికి సంబంధించిన నోటీసు ఇవ్వడంపై జనసేన పార్టీ తీవ్రంగా విభేదించినట్టు తెలుస్తోంది.
మరో ఏడాది కాలంలో మోషన్ రాజు పదవీ విరమణ చేయనున్నారు. వచ్చే ఎడాది జూలై నాటికి ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఈ మధ్యకాలంలో మహా అయితే మరో మూడుసార్లు లేదా నాలుగు సార్లు మాత్రమే సమావేశం జరుగుతుంది. ఈ మాత్రం దానికి ఇప్పుడు మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ఎస్సీ సామాజిక వర్గంలో వ్యతిరేకతను ఎదుర్కునే అవకాశం ఉంటుందని పలువురు జనసేన పార్టీకి చెందిన నాయకులు వ్యాఖ్యానించారు.
అనవసరమైన విషయాల్లో తొందరపడటం వల్ల ప్రయోజనం కన్నా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసు ఇవ్వాలని భావించినప్పటికీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్సీలు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మోషన్ రాజుకు రాజకీయ వర్గాల్లో మంచి పేరుంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గంలో కూడా మంచి పేరుంది. ఇప్పుడు ఆయనను తొలగించడం ద్వారా లేదా ఆయనపై చర్చించడం ద్వారా సరైన సంకేతాలు ఇచ్చినట్టు ఉండదని జనసేన పార్టీ నాయకులు భావిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే కొన్ని అంశాలపై ఎస్సీ సామాజిక వర్గంలో చర్చ నడుస్తోందని, ఇప్పుడు మోషన్ రాజు విషయం కూడా తెర మీదకు వస్తే అది మరింత ఇబ్బందికర పరిణామానికి దారితీస్తుందని కొందరు ఎమ్మెల్సీలు అంచనా వేస్తున్నారు.
అందుకే ప్రస్తుతానికి మోషన్ రాజు పై అవిశ్వాస తీర్మానం వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటారా లేకపోతే ఆయన పదవీకాలం వరకు అలానే వదిలేస్తారా అనేది చూడాలి. మరోవైపు కావాలంటే తనను తొలగించుకోవచ్చని తనకు అభ్యంతరం లేదని మోషన్ రాజు సభలోనే వెల్లడించడం గమనార్హం.
This post was last modified on March 8, 2026 10:43 am
విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…