2029లో జరిగే ఎన్నికలకు సంబంధించి వైసీపీ, టీడీపీలు ఇప్పటి నుంచే ఆయుధాలను రెడీ చేసుకుంటు న్నాయా? వాటికి పదును కూడాపెంచుకుంటున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. దీని లో ప్రధానంగా గత ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్గ్‌తో టీడీపీ వైసీపీని ఎలా అయితే.. దెబ్బ కొట్టిందో.. ఇప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని కూడా అదే కోణంలో చూస్తోంది. దీనిని వచ్చే ఎన్నికల వరకు.. ప్రజల మధ్య చర్చకు ఉంచాలన్నది టీడీపీ పక్కా వ్యూహం.
దీనికి తోడు.. తాజాగా బీసీ రిజర్వేషన్ అంశం కూడా.. టీడీపీకి కలిసివస్తుందని నాయకులు చెబుతున్నా రు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతున్న అధికార పక్షంఎమ్మెల్యేలు.. తమకు ఆయుధాలు రెడీగా ఉన్నాయని.. మళ్లీ విజయం తమదేనని చెబుతున్నారు. బీసీల రిజర్వేషన్‌ను కూటమి సర్కారు 34 శాతానికి పెంచడం ఖాయం. దీనిపై వైసీపీ యాగీ చేయడమూ ఖాయమనేనని అంచనా వేస్తున్నారు. ఇలా జరిగితే.. దీనిని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని టీడీపీ ప్లాన్ చేసిందని అంటున్నారు.
బీసీ వ్యతిరేకి ఎవరు? బీసీలకు అనుకూలం ఎవరు అనే చర్చను ప్రజల మధ్యకు తీసుకువచ్చి వైసీపీకి బలమైన షాక్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, ఇప్పటికే రాష్ట్రంలో బీసీల ఓటు బ్యాంకు.. ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్ ద్వారా వారిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నదిటీడీపీ వ్యూహం. అదేస మయంలో పెట్టుబడుల కల్పనకు పెద్దపీ ట వేస్తున్న సర్కారు… వైసీపీ హయాంలో పెట్టబడిదారును ఎలా తరిమి కొట్టారో.. ప్రజలకు వివరిస్తూనే ఉంది. దీనిని మరింత పెంచనున్నట్టు కూడా నాయకులు చెబుతున్నారు.
ఇక, మద్యం కుంభకోణం కేసు వైసీపీని వచ్చే ఎన్నికల వరకు ఉక్కిరి బిక్కిరి చేయనుంది. ఈ కేసు విచా రణ ఇంకా సగం కూడా పూర్తి కాలేదని.. సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగానే చెప్పడం.. నిన్న మొన్నటి వరకు 3500 కోట్లు తిన్నారన్న అధికారులకు కౌంటర్ గా ఇప్పుడు 10 వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్ప డం ద్వారా.. వైసీపీని ఇరకాటంలో పడేశారు. దీంతో పాటు.. జగనన్న ఇళ్ల విషయంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతిని కూడా ఈ నెలలో తెరమీదికి తీసుకురానున్నారు. ఇవి… ప్రధానంగా టీడీపీకి ఎన్నికల అస్త్రాలుగా మారనున్నాయన్నది ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్న మాట. దీనికి కౌంటర్లు వెతుక్కోవడం.. వైసీపీ వంతు. మరి ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on March 7, 2026 8:17 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…