Political News

మాదిగల కర్ణుడు సీఎం రేవంత్ రెడ్డి

మాదిగ స‌మాజానికి తాను క‌ర్ణుడిలాంటి వాడిన‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మ‌హాభార‌తంలో మిత్ర ధ‌ర్మానికి క‌ట్టుబ‌డి క‌ర్ణుడు కౌర‌వుల వెంటే తుది వ‌ర‌కు ఉన్నాడ‌ని ఆయ‌న గుర్తు చేశారు. అలానే తానుకూడా మాదిగ సోద‌రుల‌కు అండ‌గా ఉంటాన‌ని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ప్ర‌భుత్వం నుంచి అన్ని సంక్షేమ ఫ‌లాలు సంపూర్ణంగా అందించాలన్న‌దే త‌న కృత నిశ్చ‌య‌మ‌ని చెప్పారు. “గ‌తంలో ఎవ‌రో ఎస్సీల‌కు ముఖ్య‌మంత్రి పీఠం ఇస్తామ‌ని త‌ర్వాత‌.. వారే గ‌ద్దెనెక్కారు. కానీ, నేను అలా చేయ‌ను. మీకు క‌ర్ణుడి మాదిరిగా చివ‌రి వ‌ర‌కు అండ‌గా ఉంటా.“అని వ్యాఖ్యానించారు.

“మాదిగ ఎంప్లాయిస్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ“ ఆధ్వర్యంలో శిల్పకళావేదికలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రిని కమిటీ స‌త్క‌రించింది. అనంత‌రం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త‌మ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంద‌న్నారు. 2023లో అంద‌రూ క‌ల‌సి త‌మ‌ను బ‌ల‌ప‌రిచార‌ని.. ప్ర‌జాప్ర‌భుత్వాన్ని ఎన్నుకున్నార‌ని చెప్పారు.

ప్ర‌జ‌లకు ఎక్క‌డ ఏ అవ‌స‌రం ఉన్నా.. తాము గుర్తించి వాటికి అనుగుణంగానే పాల‌సీల‌ను రూపొందిస్తున్నామ‌న్నారు. ఎస్సీ సామాజిక వ‌ర్గం అభ్యున్న‌తి కూడా త‌మ‌కు అత్యంత కీల‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. రిజ‌ర్వేష‌న్ల కోసం.. ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు జ‌రిగిన పోరాటాలు త‌న‌కు గుర్తున్నాయ‌న్నారు.

సామాజిక వ‌ర్గాల వ‌ర్గీక‌ర‌ణ‌కు.. స‌భ‌లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించ‌డానికి కార‌ణం.. మాదిగ సోద‌రులు ప‌డుతున్న క‌ష్టం చూసి చ‌లించ‌డ‌మేన‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. “ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. దీనికి నేను ఎంతో గ‌ర్విస్తున్నా. ఈ విష‌యంలో ఎలాంటి  తేడా లేదు. ముందు నుంచి స్ప‌ష్టంగా ఉన్నాం. స్ప‌ష్ట‌మైన వైఖ‌రినే తీసుకున్నాం. మాదిగ‌లు మాకు అత్యంత ముఖ్యం. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం. కేవ‌లం వ‌ర్గీక‌ర‌ణ‌తోనే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌నినేను అనుకోవ‌డం లేదు“ అని వ్యాఖ్యానించారు.

భూములు లేవు!

“నేను ఎవ‌రో చెప్పిన‌ట్టు ఎస్సీల‌కు ఎక‌రాల‌కు ఎక‌రాల భూములు ఇస్తాన‌ని చెప్ప‌ను“  అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ‌తంలో బీఆర్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ప‌రోక్షంగా గుర్తు చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం వ‌ద్ద భూములు కూడా లేవ‌న్నారు.

అయితే.. ఎస్సీల‌కు, అన్ని సామాజిక వ‌ర్గాల పిల్ల‌ల‌కు చ‌దువు మాత్రం నాణ్యంగా చెప్పిస్తామ‌న్నారు. “గత ప్రభుత్వం గొర్రెలు, బర్రెలు, చేప పిల్లలు ఇచ్చింది. కానీ, చెప్పులు కుట్టే ఈ జాతి ప్రజలు డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కావాల‌నినేను ల‌క్ష్యంగా పెట్టుకున్నా“ అని సీఎం వ్యాఖ్యానించారు. చ‌దువును మించిన ఆస్తి లేద‌ని చెప్పారు.

This post was last modified on March 6, 2026 10:57 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

1 hour ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

1 hour ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

2 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

3 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago