Political News

మండలి ఛైర్మన్ పై అవిశ్వాసం? సాధ్యమేనా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు తమకు బలం ఉన్న శాసనమండలిలో మాత్రం హడావిడి చేస్తున్నారు. ఇక, రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న లడ్డూ అంశంపై చర్చ సందర్భంగా మండలి చైర్మన్ మోషేన్ రాజు, టీడీపీ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ సభ్యులకు మోషేస్ రాజు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మంత్రులు, టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

అయితే, తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని మోషేస్ రాజు అంటున్నారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్సీలు ఐదుగురు రాజీనామా చేసినా ఆ రాజీనామాలను మోషేస్ రాజు ఆమోదించలేదు. ఈ నేపథ్యంలోనే చైర్మన్‌ మోషేస్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఆ ఐదుగురు ఎమ్మెల్సీలు రెడీ అయినట్లు తెలుస్తోంది.

మండలి ఛైర్మన్ మోషేస్ రాజు తీరుకు నిరసనగా ఆయనపై అవిశ్వాసం పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టడానికి అవసరమైన సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆ ఐదుగురు అడుగులు వేస్తున్నారట.

వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ తదితరులు మోషేస్ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ అవిశ్వాసం పెడితే నెగ్గుతుందా? వీగిపోతుందా? అన్నది తేలాల్సి ఉంది.

ఒకవేళ ఈ ఐదుగురు తీర్మానం పెట్టినా.. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్యాబలం ఎక్కువ ఉండడంతో మండలి చైర్మన్ ను మార్చడం అంత తేలికమైన విషయం కాదనేది రాజకీయ విశ్లేషకుల మాట.

This post was last modified on March 4, 2026 2:37 pm

Share

Recent Posts

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

50 minutes ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

1 hour ago

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

2 hours ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

4 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

4 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

4 hours ago