Political News

వాహ్ పవన్.. వన్య ప్రాణులకు అంబులెన్సులు

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీ శాఖకు అంబులెన్సులు, ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేపట్టిన ‘హనుమాన్’ ప్రాజెక్టు కింద మొత్తం 100 వాహనాలను కేటాయించారు. గాయపడిన వన్యప్రాణులను తక్షణం రక్షించేందుకు, మానవ, వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.

ఈ అంబులెన్సుల్లో జంతువులను తరలించేందుకు హైడ్రాలిక్ లిఫ్టులు, అత్యవసర శస్త్రచికిత్స పరికరాలు, మందులు, రక్త పరీక్షల కోసం మైక్రోస్కోపులు, రెస్క్యూ గేర్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలోనే చికిత్స అందించే మొబైల్ వెటర్నరీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

రాష్ట్రవ్యాప్తంగా 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఈ వాహనాలతో అనుసంధానించారు. తిరుపతి, రాజంపేట తదితర కీలక కేంద్రాల్లో ప్రాథమికంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ హనుమాన్ ప్రాజెక్టు ద్వారా మానవ–వన్యప్రాణి సంఘర్షణను తగ్గించడం ప్రధాన లక్ష్యమన్నారు. వన్యప్రాణుల వల్ల రైతులకు కలిగే పంటనష్టం, ప్రజలకు కలిగే ప్రాణనష్టం తగ్గించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

హనుమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఘటనలు చోటుచేసుకున్న వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం, బాధితులకు తక్షణ పరిహారం అందించడం జరుగుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్యప్రాణి దాడుల్లో గాయపడిన, మృతిచెందిన వారికి రూ.4 కోట్ల పరిహారం చెల్లించినట్లు వెల్లడించారు.

This post was last modified on March 3, 2026 12:23 pm

Share

Recent Posts

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

16 minutes ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

24 minutes ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

1 hour ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

2 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

2 hours ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

5 hours ago