Movie News

బుచ్చిబాబు రెహమాన్ మళ్ళీ పేల్చేశారు

టాలీవుడ్ స్టార్ హీరోలందరిలోనూ ఒక ఎనర్జీ ఉంటుంది. దాన్ని సరిగ్గా వాడుకోవడం తెలిసిన దర్శకులే అద్భుతాలు చేస్తారు. సుకుమార్ చూపించబట్టే అల్లు అర్జున్ ఇవాళ జాతీయ స్థాయిలో పుష్ప ద్వారా ప్యాన్ ఇండియా మార్కెట్ సంపాదించుకున్నాడు. రాజమౌళి విజన్ లేకపోయి ఉంటే ప్రభాస్ స్టార్ డం ఇప్పుడు మరోలా ఉండేదేమో. ఇప్పుడీ ప్రస్తావనకు కారణం పెద్ది. ఇప్పటిదాకా వచ్చిన రెండు పాటలు చికిరి చికిరి, రైరైరారై విడుదలైన కొన్ని గంటల్లోనే ఛార్ట్ బస్టర్స్ అయిపోయాయి.

సోషల్ మీడియాని ట్వీట్లు రీల్స్ తో నింపేశాయి. ఇంత యునానిమస్ గా ఈ మధ్యలో ఫుల్ పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఆల్బమ్ పెద్ది అనడంలో అతిశయోక్తి లేదు. రామ్ చరణ్ డాన్స్ వల్లే ఇవి హైలైట్ అయ్యాయని ఫ్యాన్స్ అనొచ్చు. అది నిజం. కానీ క్రెడిట్ బుచ్చిబాబు, రెహ్మాన్ కు ఇవ్వాలి. ఎందుకంటే ఇదే చరణ్ ని గేమ్ ఛేంజర్ లో శంకర్ వృథా చేసుకున్నారు. రా మచ్చా సాంగ్ కొరియోగ్రఫీ, బీచ్ రోడ్డులో చేయించిన డాన్స్ బిట్ ఎంత బ్యాడ్ అవుట్ ఫుట్ గా నిలిచాయో తెలిసిందే.

ఆచార్యలో చరణ్ ఉన్నది అరగంటే అయినా తన గ్రేస్ ని వాడుకోవడంలో కొరటాల శివ కూడా ఫెయిలయ్యారు. ఆర్ఆర్ఆర్ రాజమౌళి సినిమా కాబట్టి దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. కానీ బుచ్చిబాబు ఏకంగా స్టేడియం బయటికి సిక్సర్ కొట్టేశారు. రెహమాన్ కంపోజింగ్, బుచ్చి పిక్చరైజేషన్, జానీ మాస్టర్ నృత్య రీతులు వెరసి అభిమానులతో రిపీట్ మోడ్ లో వ్యూస్ తెస్తున్నాయి. టీజర్, చికిరి చికిరి, రైరైరారై వరసగా మూడు కంటెంట్లు బ్లాక్ బస్టర్ అయ్యాయి.

ఇప్పటికే సరిపడా ఉన్న బజ్ ని ఇవి మరింత పెంచుతున్నాయి. ఇంకా ట్రైలర్ రావాలి. మరో రెండు సాంగ్స్ బ్యాలన్స్ ఉన్నాయి. శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరుల పాత్ర పరిచయాలు వీడియో రూపంలో జరగలేదు. ఇవన్నీ వచ్చేస్తే అంచనాలు ఏ స్థాయికి వెళ్ళిపోతాయో వేరే చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా జాన్వీ కపూర్ కాంబినేషన్ లో రామ్ చరణ్ ఎలాంటి రొమాంటిక్ సాంగ్ చేసి ఉంటాడోననే ఆసక్తి మూవీ లవర్స్ లో విపరీతంగా ఉంది. ఏదైతేనేం రెహమాన్, బుచ్చిబాబు కలిసి పెద్ది రూపంలో మరో డైనమెట్ అయితే పేల్చేశారు. ఫ్యాన్స్ కోరుకునేది ఇదే.

This post was last modified on March 3, 2026 11:25 am

Share

Recent Posts

నటనలో కేర్‌టేకర్‌… జనం మెచ్చిన నానా పటేకర్

బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…

2 hours ago

ఇన్నేళ్ళ తర్వాత శ్రీమంతుడు రీమేకా?

కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కినన్ని రీమేక్‌లు మరే భాషలోనూ వచ్చి ఉండవు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళంలో హిట్టయిన…

4 hours ago

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

5 hours ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

5 hours ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

6 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

6 hours ago