వైసీపీ ఎమ్మెల్యేల వ్యవహారం మరోసారి చర్చకు దారి తీసింది. కొందరు ఎమ్మెల్యేలకు సభకు వెళ్లాలని.. మరికొందరు జగన్ చెప్పింది వినాలని.. ఇలా రెండు వర్గాలుగా నాయకులు చీలిపోయారు. ప్రదానంగా కొందరు సభకు వెళ్లాలని చూస్తున్నారు. అయితే.. పార్టీ అధిష్టానం ఆదేశాలను ధిక్కరించిన వారమవుతామన్న ఆలోచన వారిలో కనిపిస్తోంది. దీంతో అసెంబ్లీకి వస్తున్నా.. సభకు వెళ్లకుండా.. బయటే ఉండి పోతున్నారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు.. మీడియాతో మాట్లాడి సంతృప్తి చెందుతున్నారు.
ఇక, మిగిలిన మరో ఐదారుగురు పార్టీ ఆదేశాలకు అనుగుణంగా.. సభకు దూరంగా ఉంటున్నారు. కానీ, వారి లోనూ సభకు రావాలన్న తహతహ కనిపిస్తోంది. దీంతో తమ జిల్లా గురించి.. సభలో ప్రశ్నించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో సభకు రాకపోయినా.. రాత పూర్వక ప్రశ్నలు సంధించే అవకాశం ఉండేది. అయితే.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఈ తరహా అవకాశాన్ని పక్కన పెట్టారు.
ప్రశ్నలు అడగాలని అనుకున్న వారు.. సభకు హాజరు కావాలని.. మంత్రులు సమాధానం చెబుతున్నప్పుడు.. సభలో ఉండాలని నిర్దేశించారు. దీంతో సభకు రాని వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రశ్నలు సంధించే అవకాశం కోల్పోయారు. ఇదిలావుంటే.. సభకు రావాలనికోరుకుంటున్న వారిని పరిశీలిస్తే..రెండు కారణా లు కనిపిస్తున్నాయి.
1) నియోజకవర్గంలో సమస్యలు పెరుగుతుండడం. తాము పట్టించుకోవాలంటూ.. పెద్ద ఎత్తున నియోజకవర్గంలో డిమాండ్లు వస్తున్నాయి. దీంతో వారిపై ఒత్తడి పెరుగుతోంది.
2) ప్రజల్లో సానుభూతి లేకపోవడం.: సహజంగా సభకు హాజరై తమ తరఫున ప్రశ్నించే వారిని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. కానీ, జగన్ కోసం.. ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా ఉండిపోవడంతో వారిపై సింపతీ పెరగకపోగా.. కూటమి నాయకులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎలాగోలా సభకు హాజరు కావాలని భావిస్తున్నారు. మరో 10 రోజులకు పైగానే సభ జరగనున్న నేపథ్యంలో సభలోపలికి రాకపోయినా.. మీడియా ముందైనా కనిపించేందుకు కొందరు ఉత్సాహ పడుతున్నారు.
This post was last modified on February 27, 2026 11:41 pm
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…