Political News

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు. వాస్త‌వానికి మెజారిటీ స‌భ్యులు ఉన్నప్ప‌టికీ.. మండ‌లిలోనూ  పార‌ద‌ర్శ‌క విధానంలో కార్య‌క్ర‌మాలు జ‌రిగేలా వైసీపీ స‌భ్యులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. గురువారం చిన్న‌పిల్ల‌లు ఊదుకునే విజిల్స్ తీసుకువ‌చ్చి.. చైర్మ‌న్ పోడియంను ముట్ట‌డించి.. విజిల్స్ వేసిన వైసీపీ స‌భ్యులు శుక్ర‌వారం దేవుడి ఫొటోల‌తో హ‌ల్చ‌ల్ చేశారు.

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో కల్తీ నెయ్యి వినియోగించార‌న్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో మండ‌లిలో చ‌ర్చ‌లు కాస్తా దారి త‌ప్పాయి. సీఎం చంద్ర‌బాబు కుటుంబ సార‌ధ్యంలోని హెరిటేజ్ సంస్థ‌కు.. ఇందాపూర్ డెయిరీకి లింకు పెట్టి దీనిపై చ‌ర్చించాలంటూ.. వ‌రుస‌గా మూడో రోజు కూడా.. స‌భ‌లో వైసీపీ స‌భ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిని చైర్మ‌న్ వ‌రుస‌గా శుక్ర‌వారం కూడా తోసిపుచ్చారు. దీంతో దేవుడి ఫొటోలు ప‌ట్టుకుని వైసీపీ స‌భ్యులు నినాదాలు చేశారు.

తీవ్రంగా ఖండించిన అధికార స‌భ్యులు..

వైసీపీ స‌భ్యులు మండ‌లిలో ప్ర‌వ‌ర్తించిన తీరును అధికార కూట‌మి పార్టీల స‌భ్యులు తీవ్రంగా ఖండించారు. ఇది మండ‌లి సంప్ర‌దాయాల‌కు విరుద్ధ‌మ‌ని.. మంత్రులు ప‌య్యావుల కేశ‌వ్‌, కందుల దుర్గేష్ త‌దిత‌రులు తీవ్రంగా మండిప‌డ్డారు. వైసీపీ స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌ను అనుమ‌తించ‌వ‌ద్ద‌ని చైర్మ‌న్‌కు సూచించారు. దీంతో చైర్మ‌న్ సైతం వైసీపీ స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌ను తాను అనుమ‌తించ‌డం లేద‌ని.. వారిని పిలిచి చ‌ర్చిస్తాన‌ని చెప్పారు. అయితే.. క్ష‌మాప‌ణ‌లు చెప్పించాల‌ని అధికార పార్టీల స‌భ్యులు డిమాండ్ చేయ‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది.

ఇదే తొలిసారి..

చ‌ట్ట‌స‌భ‌ల్లో కాయితాలు చింప‌డం.. చ‌ర్చ‌ల ప్ర‌తుల‌ను చింపిపోయ‌డం, నినాదాలు చేయ‌డం కామ‌నే. అయితే.. తొలిసారి విజిల్స్ తీసుకుని వ‌చ్చి ఈల‌లు వేస్తూ గోల చేయ‌డం ఇదే తొలిసారి అని మాజీ స‌భ్యులు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా శ్రీవారి చిత్ర‌పటాల‌ను స‌భ‌లోకి తీసుకువ‌చ్చి.. రాజ‌కీయంగా వాడుకునే ప్ర‌య‌త్నం స‌రికాద‌ని.. ఇది హిందువుల మ‌నో భావాల‌ను దెబ్బ‌తీయ‌డ‌మే అవుతుంద‌ని చెబుతున్నారు. ఇదే విష‌యాన్ని కూట‌మి స‌భ్యులు కూడా చెబుతున్నారు. ఈనేప‌థ్యంలో వైసీపీ స‌భ్యుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. 

This post was last modified on February 21, 2026 5:36 am

Share

Recent Posts

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

12 minutes ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

3 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

3 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

3 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

4 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

7 hours ago