27 ఏళ్ల క్రితం మైక్రోసాఫ్ట్ అధినేత, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ తో హైదరాబాద్ లో సీఎం చంద్రబాబు భేటీ అయిన సందర్భం తెలుగు వారందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఒక్క మీటింగ్ ఏపీ, తెలంగాణలోని వేలాది మంది యువత భవితను మార్చేసింది.
తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది నేడు ఐటీ ఉద్యోగులుగా దేశవిదేశాల్లో స్థిరపడ్డారంటే అందుకు ఆనాటి ఆ ఒక్క మీటింగే కారణమనేది అనేక విశ్లేషకుల మాట. కట్ చేస్తే…27 సంవత్సరాల తర్వాత అమరావతిలో అదే బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారు.
ఏపీ సచివాలయానికి చేరుకున్న బిల్ గేట్స్ కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీ అయ్యారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి వారు చర్చించారు.
గేట్స్ ఫౌండేషన్ సహాయసహకారాలతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఏపీ ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్టుల విస్తరణ గురించి కూడా వారు చర్చించారు. సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్‌గేట్స్ పరిశీలించారు. ఆర్టీజీఎస్ విధానాల గురించి గేట్స్‌కు చంద్రబాబు వివరించారు.
ఉండవల్లి దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రంలో గేట్స్ టీం పర్యటించనుంది. సాగుకు సంబంధించిన విధానాలను పరిశీలించనుంది. డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టిన సాగు గురించి గేట్స్ టీంకు మంత్రులు వివరించనున్నారు.
అంతకుముందు, గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్ కు మంత్రులు లోకేశ్, అనిత, అచ్చెన్నాయుడు, సత్య కుమార్ ఘన స్వాగతం పలికారు. అయితే, బిల్‌గేట్స్ ప్రయాణించిన విమానం ల్యాండింగ్‌కు పొగమంచు కారణంగా ఇబ్బందులు వచ్చాయి. ఏటీసీ క్లియరెన్స్ రాకపోవడంతో విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత క్లియరెన్స్ ఇవ్వడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
This post was last modified on February 16, 2026 12:34 pm
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…