తెలంగాణ రాజకీయాల్లో చిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ లు చేతులు కలిపాయి. ఫలితంగా మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్ మునిసిపాలిటీని దక్కించుకున్నాయి. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి నిన్నటి వరకు బీఆర్ఎస్-కాంగ్రెస్ ల మధ్య ఫెవికాల్ బంధం ఉందని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈయన చేసిన వ్యాఖ్యలను కాదని.. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్.. కాంగ్రెస్-బీఆర్ ఎస్ మధ్య ఎం-సీల్ బంధం ఉందన్నారు.
ఇలా.. బీజేపీ నాయకులు అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో అనూహ్యంగా అలియాబాద్ మునిసిపాలిటీని దక్కించుకునేందుకు ఈ విమర్శలను.. ప్రతివిమర్శలను కూడా పక్కన పెట్టి.. కమలం-చెయ్యి చేతులు కలిపాయి. దీంతో రాత్రికి రాత్రి వ్యూహాలు మారిపోయి.. ఇరు పార్టీల నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కౌన్సిల ర్లు.. ఏకమయ్యారు. ఫలితంగా బీఆర్ ఎస్‌కు షాకిచ్చారు.
తాజాగా సోమవారం ఉదయం.. అలియాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్‌గా కాంగ్రెస్ అభ్యర్థి శిరీష కంఠం.. ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కౌన్సిలర్లుగా ప్రమాణం చేశారు. వాస్తవానికి అలియాబాద్ మునిసిపాలిటీలో ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. దీంతో తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఈ సమయంలో కాంగ్రెస్-బీజేపీలు ముందుకు వచ్చి.. బీఆర్ ఎస్‌కు ఛాన్స్ ఇవ్వకుండా.. చేతులు కలపడం విశేషం. చైర్ పర్సన్ పదవిని కాంగ్రెస్, బీజేపీ(చివరి ఏడాది)లు పంచుకునేలా ఒప్పందం కుదిరింది.
ఇవీ బలాబలాలు..
అలియాబాద్‌లో మొత్తం వార్డులు : 20
అధికారం దక్కాలంటే గెలవాల్సిన వార్డులు: 11
కాంగ్రెస్ గెలిచిన వార్డులు: 8
బీజేపీ గెలిచిన వార్డులు: 3
బీఆర్ ఎస్‌కు దక్కిన వార్డులు: 7
ఇండిపెండెంట్లు: ఇద్దరు
+ బీజేపీ+కాంగ్రెస్ కలయికతో మేజిక్ ఫిగర్ సాకారం అయింది.
This post was last modified on February 16, 2026 4:47 pm
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…