తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 116 మున్సిపాలిటీలకు గాను 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 13 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపొందగా…38 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది
వార్డుల వారీగా 2582 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 1347 వార్డులు దక్కించుకుంది. బీఆర్ఎస్ 717 వార్డుల్లో,
బీజేపీ 261 వార్డుల్లో, ఇతరులు 256 వార్డుల్లో విజయం సాధించారు.
ఈ నేపథ్యంలోనే ఈ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇంతటి అఖండ విజయం కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. లక్షలాదిమంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమే ఈ విజయమన్నారు.
భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితమని చెప్పారు. రెండేళ్ల ప్రజాపాలన, అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇది ప్రజా తీర్పు అని తెలిపారు. ఈ గెలపు తమ బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. ప్రతి మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్‌ను గొప్పగా అభివృద్ధి చేస్తామన్నారు.
This post was last modified on February 13, 2026 9:28 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…