Trends

వికెట్ల వెనుక నుంచి బంతి విసరవచ్చా?

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్‌ ఒక ఆసక్తికర చర్చకు దారితీసింది. నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ వికెట్ల వెనుక నుంచి బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా బౌలర్లు క్రీజు లోపలి నుంచే బౌలింగ్ చేయడం చూస్తుంటాం, కానీ ఎరాస్మస్ ఏకంగా అంపైర్ వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని వదలడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఐసీసీ నిబంధనల ప్రకారం ఇది కరెక్టేనా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.

ఐసీసీ రూల్స్ ప్రకారం, ఒక బౌలర్ పాపింగ్ క్రీజ్ (క్రీజు గీత) వెనుక నుంచి ఎక్కడి నుంచైనా బౌలింగ్ చేయవచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. బౌలర్ బంతిని వదిలేటప్పుడు అంపైర్ దృష్టికి ఆటంకం కలగకూడదు. ఒకవేళ బౌలర్ అంపైర్ వెనుక నుంచి రావడం వల్ల, అంపైర్ ఆ బంతిని సరిగ్గా చూడలేకపోతే దానిని ‘డెడ్ బాల్’గా ప్రకటించే అధికారం అంపైర్‌కు ఉంటుంది. నమీబియా మ్యాచ్‌లో కూడా ఒకసారి అంపైర్ రాడ్ టక్కర్ అదే కారణంతో డెడ్ బాల్ ఇచ్చారు. 

ఎరాస్మస్ ఇలాంటి వింత బౌలింగ్‌తో భారత బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తిలక్ వర్మను అవుట్ చేసిన సమయంలో అతను క్రీజుకు చాలా వెనుక నుంచి బంతిని వదిలి వికెట్ సాధించాడు. అంపైర్ ముందుగానే ఈ యాక్షన్ గురించి తెలిసుంటే దానిని ఫెయిర్ బాల్‌గానే పరిగణిస్తారు.

ఇక ఈ మ్యాచ్ లో కూడా ముందుగానే ఒకసారి ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి కాబట్టి అది ఫెయిర్ డెలివరీ అయ్యింది. ఏదేమైనా ఈ తరహా బౌలింగ్ వెనుక ఒక వ్యూహం కూడా ఉంది. బౌండరీలు చిన్నగా ఉన్నప్పుడు లేదా బ్యాటర్లు సెట్ అయినప్పుడు, వారి రిథమ్‌ను దెబ్బతీయడానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. 

ఎరాస్మస్ తన సైడ్ ఆర్మ్ వేరియేషన్లతో టీమిండియాను కట్టడి చేయడమే కాకుండా, వికెట్ల వెనుక నుంచి బౌలింగ్ చేస్తూ బ్యాటర్లను అయోమయంలో పడేశారు. ఈ మ్యాచ్‌లో అతను తీసిన 4 వికెట్లు చూస్తుంటే, ఈ ‘వింత’ వ్యూహం కొంతవరకు ఫలించిందనే చెప్పాలి. అయితే ఎరాస్మస్ ప్రదర్శన భారత్‌కు రాబోయే పాకిస్థాన్ మ్యాచ్‌కు ఒక హెచ్చరికలాంటిదని చెప్పవచ్చు. 

పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ కూడా ఇలాంటి అసాధారణ బౌలింగ్ యాక్షన్ తో మధ్యలో ఆగడం వంటి పద్ధతులతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు. తారిక్ బౌలింగ్ చేసేటప్పుడు క్రీజు వద్ద రెండు మూడు సెకన్ల పాటు ఆగడం బ్యాటర్ టైమింగ్‌ను పూర్తిగా దెబ్బతీస్తుంది. కాబట్టి, నమీబియా కెప్టెన్ చేసిన ఈ ప్రయోగాలు పాక్ స్పిన్నర్‌ను ఎదుర్కోవడానికి టీమిండియాకు ఒక చిన్నపాటి రిహార్సల్‌లా పనికొస్తాయని చెప్పవచ్చు.

This post was last modified on February 13, 2026 4:39 pm

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

4 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

12 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

27 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

29 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago