Political News

తెలంగాణలో జనసేన, టీడీపీ బోణీ!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ నిలిచాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలతోపాటు అనూహ్య విజయాలు నమోదయ్యాయి. తెలంగాణలో జనసేన, టీడీపీ బోణీ కొట్టాయి.

తెలంగాణలో ఒకప్పుడు బలంగా ఉన్న టీడీపీ కొంతకాలంగా బలహీనపడింది. ఈ క్రమంలోనే అక్కడ పూర్వ వైభవం కోసం పోరాడుతున్న టీడీపీ బోణీ కొట్టింది. ఖమ్మం జిల్లా మధిరలో తెలుగుదేశం పార్టీకి చెందిన బోడేపూడి రేవతి విజయం సాధించారు. బీఆర్ఎస్ కు చెందిన సుధాకర్ మీద ఆమె గెలిచి చాలా కాలం తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేలా చేశారు. తాజా ఫలితం తెలుగుదేశం పార్టీకి నూతనోత్సాహాన్నిచ్చింది.

ఇక, తెలంగాణలో జనసేన కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బోణీ కొట్టింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ కార్పొరేటర్ గా జనసేన అభ్యర్థి అగ్గు సాగర్ గెలుపొందారు. 31 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. దాంతోపాటు, సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై 60 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలను కాదని మరీ జనసేనకు పట్టం కట్టటంతో జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ రెండు పార్టీలకు ఈ విజయం చిన్నదే అయినా భవిష్యత్తులో మరిన్ని విజయాలకు ఇదే నాంది అని ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో.. ఆయన ఇచ్చిన ధైర్యంతో ఎన్నికల బరిలో దిగి విజయం సాధించామని జనసేన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో జనసేన తరఫున 336 మంది అభ్యర్థులు బరిలో దిగారు. వీరి తరఫున జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయాలని భావించారు. దీనికి సంబంధించిన ప్రచార షెడ్యూల్ సైతం కన్ఫర్మ్ అయ్యింది అయితే.. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. పార్టీ తరఫున ఆర్ కే సాగర్, హైపర్ ఆది, తనీష్ వంటి వారు తరఫున ప్రచారం చేశారు.

This post was last modified on February 14, 2026 11:32 am

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

36 minutes ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

53 minutes ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

1 hour ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

2 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

4 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

6 hours ago