అభ్యర్థులకు పార్టీ గుర్తు లేకుండా జరిగిన పంచాయితీ ఎన్నికల్లో తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ కు 65 శాతానికి మించిన స్థానాల్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ బుధవారంతో ముగిసింది. పార్టీ గుర్తులతో అభ్యర్థులు బరిలోకి దిగిన ఈ ఫలితాలు ఎలా ఉండనున్నాయి? అధికార పార్టీకి ఈ ఎన్నికలు ఎలాంటి అనుభవాన్ని మిగిల్చే అవకాశం ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే.. దాదాపు 70 శాతానికి పైనే అధికార కాంగ్రెస్ మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను సొంతం చేసుకుంటుందని చెబుతున్నారు. శుక్రవారం (ఫిబ్రవరి 13) ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు.. 7 కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికలు అధికార కాంగ్రెస్ అధిక్యతను ఎంతన్నది తెలిపేలా ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.
మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు నడిస్తే.. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ రెండు కార్పొరేషన్లలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని చెబుతున్నారు.
షాకింగ్ అంశం ఏమంటే.. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం విపక్ష బీఆర్ఎస్ కు ఒక్కటంటే ఒక్క కార్పొరేషన్ సొంతమయ్యే వీల్లేదని చెబుతున్నారు. తెలంగాణను పదేళ్లు నాన్ స్టాప్ గా పాలించిన గులాబీ పార్టీకి తాజా కార్పొరేషన్ ఎన్నికల్లో ఉనికి లేకుండా పోవటం ఆ పార్టీ తాజా పరిస్థితికి నిదర్శనంగా చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 68 నుంచి 76 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ 29-36 మున్సిపాలిటీలను సొంతం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక.. బీజేపీ మూడు నుంచి ఐదు మున్సిపాలిటీలను సొంతం చేసుకుంటుందని చెబుతున్నారు. మజ్లిస్ సైతం బోణీ కొడుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ ఎగ్జిట్ అంచనాలను చూస్తే..కాంగ్రెస్ 36 శాతం.. బీఆర్ఎస్ 29.7 శాతం.. బీజేపీకి 19.3 శాతం.. మజ్లిస్ కు 2 శాతం ఓట్లు వచ్చే వీగెలుస్తుందని.. లేందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 1210- 1290 వార్డుల్లో గెలుస్తుందని.. బీఆర్ఎస్ 860-930 వార్డుల్లో గెలుస్తుందని.. బీజేపీ విషయానికి వస్తే 250-270స్థానాల్లో గెలిచే వీలుందని అంచనా వేస్తున్నారు.
మజ్లిస్ అధినేత తమ పార్టీ అభ్యర్తులను 35-44 స్థానాల్లోనూ గెలిచేలా ప్లాన్ చేసిందంటున్నారు.. మొత్తంగా పంచాయితీతో పోలిస్తే.. కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఫలితాలు కాస్తంత నిరాశకు గురయ్యే వీలుందంటున్నారు.
కార్పొరేషన్లలో ఖాతా తెరవని గులాబీ పార్టీ..మున్సిపోల్స్ లో అధికార కాంగ్రెస్ కు దక్కే సీట్లలో 50 శాతం కంటే ఎక్కువ సీట్లను బీఆర్ఎస్ గెలిచే వీలుందన్న అంశం కేటీఆర్ అండ్ కోకు సంతోషానికి గురి చేస్తుందని చెప్పకతప్పదు.
This post was last modified on February 12, 2026 4:07 pm
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…