Political News

డిప్యూటీ సీఎం సీటుపై కమ్మవారి కన్ను

రాజకీయంగా తమకు తగినంత న్యాయం జరగడం లేదని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసంతృప్తితో ఉన్నారా? ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నప్పటికీ సరిపడినన్ని సీట్లు తమకు కేటాయించడం లేదని వారు గుర్రుగా ఉన్నారా? ఇక, ఉప ముఖ్యమంత్రి పదవిపై కమ్మవారి కన్ను పడిందా?

ఈ సారి ఎలాగైనా డిప్యూటీ సీఎం పోస్టు తమ సామాజిక వర్గానికే కావాలని కమ్మ గ్లోబల్ ఫెడరేషన్(కేజీఎఫ్) ఫిక్సయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అయితే, ఇదంతా ఏపీ రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం కాదు..తమిళనాట తమకు మరింత ప్రాధాన్యమివ్వాలని అక్కడి కమ్మ సామాజిక వర్గ ప్రముఖుల డిమాండ్ వ్యవహారం.

నైపుణ్యాలపరంగా, సాంస్కృతిక పరంగా, వ్యాపారపరంగా, సామాజిక బాధ్యత పరంగా కమ్మ వ్యక్తులు ముందు వరుసలో ఉంటారని, అటువంటిది రాజకీయాల్లో ఎందుకు వెనకబడి ఉండాలని అన్నది వారి ప్రశ్న. ఈ క్రమంలోనే తమిళనాట అన్ని రాజకీయ పార్టీలకు కేజీఎఫ్ అల్టిమేటం జారీ చేసింది. వేలాది మందితో మెగా కమ్మ మహానాడు నిర్వహించి బల ప్రదర్శనతో తమ వాణి వినిపించింది.

ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 10 లక్షల మంది కమ్మ సామాజిక చెందిన వారున్నారని, ఇది దేశ జనాభాలో 1.5 శాతం కన్నా ఎక్కువ అని కమ్మ ప్రముఖులు అన్నారు. తమిళనాట 65 లక్షల మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజలున్నా …రావాల్సినంత గుర్తింపు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సామాజిక ఐక్యతతోనే రాజకీయ బలం చాటుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. 8 శాతం ఓటు బ్యాంకు ఉన్నా12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే కమ్మవారున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో 8 శాతం కమ్మ ఓటింగ్, 3 కోట్ల మంది తెలుగు వారి ఓటింగ్ నిర్ణయాత్మమని, కనీసం 30 మందికి ఎమ్మెల్యే టికెట్లు, ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన వారికే తమ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ మహానాడుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కమ్మ ప్రముఖులు ఈ మహానాడుకు హాజరయ్యారు. తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్య రాజాతో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు వ్యాపారవేత్తలు ఈ మహానాడుకు హాజరయ్యారు.

This post was last modified on February 9, 2026 2:05 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

2 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

13 hours ago