తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు కోర్టుకు సమర్పించింది. అయితే.. ఈ నివేదికలో పలు విషయాలను విస్మరించారన్నది కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రధాన ఆరోపణ. అసలు దోషులను విస్మరించారని.. కేవలం అధికారులపైనే నివేదిక ఆరోపణలు చేసిందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు దోషుల వ్యవహారాన్ని కూడా తేల్చి తిరుమల పవిత్రతను కాపాడాల్సి ఉందని ఆయన చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా జరిగిన కూటమి నేతల కీలక సమావేశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం.. ఈ వ్యవహారంపై పలు విషయాలను సీఎం చంద్రబాబుతో పంచుకున్నారు. దీనిలో ప్రధానంగా ఏకసభ్య కమిషన్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఇక, ఈ కమిషన్ ద్వారా వాస్తవాలను మరింత లోతుగా విచారించనున్నారు. తద్వారా దోషులను తేల్చనున్నారు. ఎంతటివారినైనా చట్టం ముందు నిలబెట్టనున్నారు.
ఇవీ తేలే విషయాలు..
+ 2022లోనే కల్తీ నెయ్యిపై సీఎఫ్టీఆర్ఐ నివేదిక వచ్చినా.. ఎందుకు తొక్కి పెట్టారు?
+ ఎవరి ఆదేశాలతో ఆనాడు నివేదికను విస్మరించారు.
+ నెయ్యి ద్వారా చేతులు మారిన సొమ్ము ఎంత?
+ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది ఎంత? ఏమేరకు కల్తీ చేశారు?
+ వైసీపీ హయాంలో ఎన్నాళ్లు ఇలా జరిగింది? దీని వెనుక ఎవరి పాత్ర ఏంటి?
+ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను మరింత కూలంకషంగా విచారణ చేయనున్నారు.
+ ఎన్‌డీడీబీ(నేషనల్ డెయిరీ డెవలప్‌మెంటు బోర్డు) నివేదికలో వెల్లడించిన వాస్తవాలపై మరింత అధ్యయనం.
+ దోషులు ఎంతటి వారైనా వారిని చట్టం ముందు నిలబెట్టడం.
This post was last modified on February 5, 2026 10:11 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…