Political News

ఏపీ సర్కారు వేసిన కమిషన్… దోషులను పట్టిస్తుందా?

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ఇప్ప‌టికే సీబీఐ నేతృత్వంలోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం విచార‌ణ జ‌రిపిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ సిట్ కొన్నిఅంశాల‌ను ప‌ట్టించుకోకుండానే.. అస‌లు నేర‌స్తుల‌ను స‌రైన విధంగా విచార‌ణ చేయ‌కుండానే నివేదిక ఇవ్వ‌డంపై రాష్ట్ర ప్ర‌భుత్వం అసంతృప్తితో ఉంది.

ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోనే ప్ర‌త్యేక క‌మిష‌న్ ఏర్పాటు చేసి.. ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై సమ‌గ్ర విచార‌ణ చేయించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు తాజాగా మంగ‌ళ‌వారం జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిపాద‌న‌ల‌కు మంత్రులు ఏక‌గ్రీవంగా ఆమోదించారు.

వాస్త‌వానికి మంత్రి వ‌ర్గ స‌మావేశంలో అనేక అంశాల‌పై చ‌ర్చించాల‌ని భావించినా.. తొలుత సుదీర్ఘంగా ల‌డ్డూ క‌ల్తీ నెయ్యి వినియోగంపై చ‌ర్చించారు. గ‌తంలోనే ల‌డ్డూ క‌ల్తీ నెయ్యిపై నివేదిక వ‌చ్చింద‌ని..దీనిని అప్ప‌టి వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని.. దీని వెనుక చాలా వ్యూహాత్మ‌క కోణంతోపాటు.. నేర‌స్తుల‌ను త‌ప్పించే ల‌క్ష్యం ఉంద‌ని మంత్రులు అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్ర‌ధానంగా.. ఎన్‌డీడీబీ(నేష‌న‌ల్ డెయిరీ డెవ‌ల‌ప్మెంట్ బోర్డు) ఇచ్చిన నివేదిక ప్ర‌కారం.. ప్ర‌స్తుతం విచార‌ణ ముగించిన సీబీఐ సిట్‌.. ఒక్క అంశాన్నీ ప‌రిగణ‌న‌లోకి తీసుకోలేద‌ని మంత్రి వ‌ర్గం అభిప్రాయ‌ప‌డింది.

దీనికి తోడు 2022లో వ‌చ్చిన సీఎఫ్‌టీఆర్‌(జంతువుల కోవ్వు ప‌దార్థాల‌ను ప‌రీక్షించే) నివేదిక‌ను కూడా వైసీపీ ప్ర‌భుత్వం ఉద్దేశ పూర్వ‌కంగానే ప‌క్క‌న పెట్టింద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో సీఎఫ్‌టీఆర్‌, ఎన్‌డీడీబీ నివేదిక‌ల ఆధారంగా కొత్త‌గా క‌మిష‌న్ వేసి.. దాని ద్వారా శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో వినియోగించిన క‌ల్తీ నెయ్యిపై విచార‌ణ చేయించాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించిన‌ట్టు మంత్రులు.. ప‌య్యావుల కేశ‌వ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్‌, స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు.

దీనిని చాలా సీరియ‌స్‌గా తీసుకుంటున్నామ‌ని.. అలాగ‌ని త‌మ‌కు రాజ‌కీయ క‌క్ష సాధింపు ఏమీ లేద‌ని.. శ్రీవారి ల‌డ్డూ ప‌విత్ర‌త‌త‌ను కాపాడ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని మంత్రులు వివ‌రించారు.

ఇక‌, గ‌తంలో సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పైనా మంత్రి వ‌ర్గంలో చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. ఎన్‌డీడీబీ నివేదిక ఇచ్చిన అంశాల‌ను అధ్య‌య‌నం చేసిన త‌ర్వాతే .. చంద్ర‌బాబు వ్యాఖ్యానించార‌ని తెలిపారు. ఇప్పుడు దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ చేయించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌న్నారు.

వాస్త‌వాల‌ను ఎవ‌రు మ‌రుగు ప‌రిచినా.. ఎవ‌రు దానిని వెనుకేసుకు వ‌చ్చినా.. నేర‌స్తులే అవుతార‌ని పేర్కొన్నారు. అయితే.. ఇప్పుడు సీబీఐ ఇచ్చిన నివేదిక నెల్లూరు కోర్టులో విచార‌ణ ప‌రిధిలో ఉండ‌గా.. తాజాగా మ‌రో క‌మిష‌న్ చేయొచ్చా.. అనే ప్ర‌శ్న‌కు.. దానికి.. దీనికి సంబంధం లేదని మంత్రులు బ‌దులిచ్చారు.

This post was last modified on February 3, 2026 7:32 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago