Political News

‘చంద్ర‌బాబు ప‌నిరాక్షసుడు’

పండుగ అన‌గానే ఎవ‌రైనా కుటుంబంతో సంతోషంగా గ‌డుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట‌.. కొంత స‌మ‌యాన్ని ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. వేరే ప‌నులు కూడా పెట్టుకోరు. కానీ, ఏపీ సీఎం చంద్ర బాబు స్ట‌యిల్ మాత్రం వేరు.

పండ‌గ పండ‌గే.. ప‌నులు ప‌నులే అన్న‌ట్టుగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న సొంత గ్రామం నారా వారిప‌ల్లెకు కుటుంబ స‌మేతంగా చంద్ర‌బాబు వెళ్లారు. ఇదేస‌మ‌యంలో నంద‌మూరి ఫ్యామిలీ కూడా అక్క‌డ‌కు చేరుకుంది.

అయితే.. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మూడు రోజుల‌పాటు.. అక్క‌డే ఉండ‌నున్నారు. సంక్రాంతి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించే భోగి మంట‌లు.. సంక్రాంతి వేడుక‌ల‌కు ఆయ‌న స‌మ‌యం కేటాయించారు. కానీ, అనూహ్యంగా త‌న షెడ్యూల్‌ను త‌నే మార్చుకున్నారు చంద్ర‌బాబు.

భోగికి ముందు రోజు స్థానికంగా ఉన్న మ‌హిళ‌ల‌కు ముగ్గుల పోటీలు నిర్వ‌హించారు. చిన్నారుల‌తో క‌లిసి.. త‌న మ‌న‌వ‌డు.. దేవాన్ష్ చేసిన సంద‌డిని.. ఆడిన ఆట‌ల‌ను కూడా ఆయన ఆస‌క్తిగా వీక్షించారు.

దీంతో నారా వారి ఫ్యామిలీ అంతా మురిసిపోయింది. చాలా రోజుల త‌ర్వాత‌..త‌మ‌కు చంద్ర‌బాబు స‌మయం ఇచ్చార‌ని అనుకున్నారు. కానీ, ఇంత‌లోనే చంద్ర‌బాబు అక్క‌డ నుంచి ఎమ్మెల్యే పులివ‌ర్తి నానీతో క‌లిసి చంద్ర‌గిరి మండ‌లం.. మూల‌ప‌ల్లెవ‌ద్ద‌కు వెళ్లారు.

అక్క‌డ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కృష్ణా న‌ది నీటిని చంద్ర‌గిరి మండ‌లానికి.. అటు నుంచి తిరుప‌తికి మ‌ళ్లించే ప‌నుల‌కు ఆయ‌న శ్రీకారం చుట్టారు. దాదాపు రెండు గంట‌ల‌కుపైగానే ఆ ప‌నుల్లో బిజీగా గ‌డిపారు.

ఈ విష‌యంపై సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మేడం సీఎంగారు వేరే చోట‌కు వెళ్లిపోయారు.. అని మీడియా మిత్రులు అన‌గానే.. “అవును. నాకు తెలుసు. ఆయ‌న ప‌నిరాక్ష‌సుడు. ఒక్క రోజు కూడా మాతో ఉండ‌రు.

గ‌తంలోనే(ప్ర‌తిప‌క్షం) లేరు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఇంకా ఏముంటారు. ఆయ‌న‌కు ప‌ని.. ప్ర‌జ‌లు ఇవే కావాలి.“ అని నిట్టూర్చారు. అయితే.. ఇదంతా ఆఫ్‌ది రికార్డే. ఎక్క‌డా బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేయ‌లేదు. కానీ, పండ‌గ రోజు కూడా ప‌నులు పెట్టుకోవ‌డం మాత్రం నారా కుటుంబాన్ని ఒకింత ఇబ్బంది పెట్టింద‌నే చెప్పాలి. 

This post was last modified on January 14, 2026 10:20 am

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

టైగర్ పవన్ కు మోడీ ప్రశంస

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి ప్రశంస‌లు ల‌భించాయి. గ‌తంలోనూ ప‌లు…

19 minutes ago

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

6 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

11 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

12 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

12 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

13 hours ago