Political News

టైగర్ పవన్ కు మోడీ ప్రశంస

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి ప్రశంస‌లు ల‌భించాయి. గ‌తంలోనూ ప‌లు సంద‌ర్భాల్లో మోడీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ప్ర‌శంసించిన విష‌యం తెలిసిందే. స‌నాత‌న ధ‌ర్మ దీక్ష చేప‌ట్టిన‌ప్పుడు.. ప‌ల్లె పండుగ ప్రారంభించి.. ప‌ల్లెల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు కూడా మోడీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ప్ర‌శంసించారు. ముఖ్యంగా క‌ర్నూలులో నిర్వ‌హించిన జీఎస్టీ బ‌చ‌త్ ఉత్స‌వం వేడుక‌ల్లో మ‌రింతగా పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

తాజాగా మ‌రోసారి ప్ర‌ధాని నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. జ‌పనీస్ క‌త్తి సాము.. కెంజుట్స్‌లోకి ప్ర‌వేశం పొందిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో `టైగ‌ర్ ఆఫ్ మార్ష‌ల్ ఆర్ట్స్‌` బిరుదు కూడా పొందారు. ముఖ్యంగా.. ప్రాచీన క‌త్తిసాములో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌వేశ పొంది.. దీనికి సంబంధించిన స‌ర్టిఫికెట్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఇలా.. టైగ‌ర్ ఆఫ్ మార్ష‌ల్ ఆర్ట్స్ బిరుదు పొందిన ఏకైక తెలుగు వ్య‌క్తి ప‌వ‌న్ క‌ల్యాణే కావ‌డం విశేషం.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తాజాగా.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను అభినందించారు. కెంజుట్సులో ప్ర‌వేశం పొంద‌డం అరుదైన ఘ‌న‌త‌గా ఆయ‌న పేర్కొన్నారు. జపనీస్‌ మార్షల్‌ ఆర్ట్స్‌(యుద్ధ విద్య‌)లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షించారు.

మూడు ద‌శాబ్దాలుగా ప‌వ‌న్ సాధ‌న చేస్తున్నారని తెలిసి తాను ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్టు తెలిపారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ నేటి యువ‌త‌కు అద్భుత సందేశం ఇచ్చారని కొనియాడారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న రికార్డుతోపాటు కేంద్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న `ఫిట్‌ ఇండియా`కు కూడా స్ఫూర్తిగా నిలిచార‌ని పేర్కొన్నారు.

`ప‌వ‌న్ జీ.. యూఆర్ భేష్‌` అంటూ.. ప్ర‌ధాని కొనియాడారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటు న‌ట‌న ప‌రంగాను.. అటు రాజ‌కీయాల్లోనూ.. మ‌రోవైపు మార్ష‌ల్ ఆర్ట్స్‌లోనూ రాణించ‌డం.. గ‌ర్వించ‌ద‌గిన విష‌య‌మ‌ని ప్ర‌ధాని పేర్కొ న్నారు. కాగా.. త‌న‌ను అభినందించిన ప్ర‌ధానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

This post was last modified on January 14, 2026 10:11 am

Share
Show comments
Published by
Kumar
Tags: ModiPawan

Recent Posts

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

6 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

11 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

12 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

12 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

12 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

14 hours ago