2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రతి పైసాను ఆచితూచి ఖర్చు చేయాలని చూస్తున్నారు. పన్నుల తగ్గింపు వల్ల వచ్చే ఆదాయంలో కొంత లోటు కనిపిస్తున్నా ఆర్థిక క్రమశిక్షణను కాపాడుకుంటూ వృద్ధిని ఎలా పెంచుతారనేదే ఇక్కడ మెయిన్ పాయింట్.
ప్రస్తుత పరిస్థితుల్లో పన్నుల వసూళ్లు అనుకున్నంత స్పీడ్ గా లేవు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యలో ఆర్థిక లోటు సుమారు రూ.9.76 లక్షల కోట్లుగా ఉంది.. ఇది ఏడాది టార్గెట్ లో 62.3 శాతానికి సమానం. జీడీపీ వృద్ధి రేటు కొంత నెమ్మదించడం వల్ల కంపెనీల లాభాలు తగ్గి అది నేరుగా పన్నుల వసూళ్లపై ప్రభావం చూపుతోంది. దీనివల్ల దాదాపు 50,000 కోట్ల ఆదాయం తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇలాంటి టైమ్ లో ఆర్‌బీఐ నుంచి వచ్చే డివిడెండ్ ప్రభుత్వానికి ఒక పెద్ద రిలీఫ్ ఇస్తోంది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గినా ఆర్‌బీఐ ఇచ్చే 2.69 లక్షల కోట్ల లాభాలు బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి హెల్ప్ అవుతున్నాయి. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ వల్ల ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక రకంగా ఖజానాకు ఆక్సిజన్ లాంటిదని చెప్పవచ్చు.
అప్పుల విషయంలో కూడా ప్రభుత్వం చాలా ప్లానింగ్ తో ఉంది. మార్కెట్ నుంచి చేసే అప్పులను 14.5 లక్షల కోట్లకే పరిమితం చేయాలని చూస్తున్నారు. ఒకవేళ అప్పులు 15 లక్షల కోట్లు దాటితే ప్రైవేట్ ఇన్వెస్టర్లకు ఇబ్బందిగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఆర్థిక లోటును 4.0 శాతం నుండి 4.2 శాతం మధ్యలో ఉంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదేమైనా 2026 బడ్జెట్ అనేది కేవలం అంకెల లెక్క మాత్రమే కాదు. ఇది భవిష్యత్ భారత్ కు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ లాంటిది. అనవసర ఖర్చులకు చెక్ పెడుతూ మౌలిక సదుపాయాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడమే వికసిత భారత్ లక్ష్యానికి సరైన దారి అని ప్రభుత్వం భావిస్తోంది. మరి నిర్మలమ్మ తన బడ్జెట్ మ్యాజిక్ తో వృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…