ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. ఉమ్మడిచిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న నారావారి పల్లెకు ప్రతి సంక్రాంతిని పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబం మొత్తం అక్కడే ఉంటుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో చంద్రగిరికి బయలు దేరారు.
అయితే.. వాస్తవానికి పండుగ సందడికోసం సొంతూరు వెళ్తున్న సమయంలో హ్యాపీగా జర్నీచేయొచ్చు. కానీ, వారు మాత్రం ప్రజల సమస్యలపై దృష్టి పెట్టారు. చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సూర్యలంక బీచ్‌ను హెలికాప్టర్ నుంచే ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు `స్వదేశీ దర్శన్ 2.0` కింద 97 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. ఈ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సర్కారు ఇప్పటికే అధికారులను ఆదేశించింది.
దీంతో ఈ నిధులతో చేపట్టిన షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ సదుపాయాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ పనులను ఏరియల్ వ్యూ ద్వారా చంద్రబాబు, నారా లోకేష్‌లు పరిశీలించారు. వీటితో పాటు సూర్యలంక ఎక్స్‌పీరియన్స్ జోన్ కూడా పరిశీలించారు. హెలికాప్టర్‌లో నారావారిపల్లెకు వెళ్తున్న సమయంలో ఈ ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిశితంగా గమనించారు. హెలికాప్టర్‌లోనే ఉన్న ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పల్లె నుంచే పాలన
సంక్రాంతిని పురస్కరించుకుని నారా వారి పల్లెకు వెళ్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు.. మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. అయితే.. అక్కడి నుంచే మూడు రోజులు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించనున్నారు. మూడు రోజులు పాలనను నానరా వారి పల్లె నుంచే సాగించనున్నారు. కాగా.. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను అక్కడే నిర్వహించుకోనున్నారు. ఈ సంబరాల్లో నందమూరి ఫ్యామిలీ కూడా పాల్గొంటుంది.
This post was last modified on January 12, 2026 10:04 pm
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…