ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. గోదావరి నుంచి సముద్రంలోకి వృథా పోతున్న జలాలను తాము వాడుకుంటామని ఏపీ చెబుతున్నా.. కేటాయింపులకు మించి చుక్క నీటిని కూడావాడుకోరాదన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. ఈ నేపథ్యంలోనే ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలు తెరమీదికి వచ్చాయి. సుప్రీంకోర్టు వరకు చేరాయి. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది.
ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలను పాటించడం లేదని.. గోదావరి జలాల్లో ఏపీకి కేటాయించిన 484టీఎంసీలకు మించి వాడుకోరాదని పేర్కొంటూ.. న్యాయ పోరాటం ప్రారంభించింది. గతంలోనే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య అవసరమని.. మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలని గత విచారణలో పేర్కొంది. దీనికి ఇరు ప్రభుత్వం తొలుత మొగ్గు చూపినా.. తర్వాత.. మళ్లీ న్యాయపోరాటానికే ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ క్రమంలో సోమవారం మరోసారి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
తొలుత తెలంగాణ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ఏకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం హాజరు కావడం విశేషం. అయితే.. సుప్రీంకోర్టులో ఏపీ వాదనలు బలంగా వినిపించడంతోపాటు.. సుప్రీంకోర్టు కూడా.. సివిల్ వివాదాల రూపంంలో సూట్ వేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం.. వ్యవహరించాలని పేర్కొంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గి.. ఇప్పటి వరకు విచారణలో ఉన్న రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది.
త్వరలోనే మరో రూపంలో కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలంగాణ సర్కారు తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా.. ప్రాజెక్టులు చేపడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకే వివాదం ఏర్పడిందన్నారు. సుప్రీంకోర్టు సూచనలతో తిరిగి మరో రూపంలో పిటిషన్ వేయనున్నట్టు వివరించారు. అయితే.. తెలంగాణ ఎలాంటి రూపంలో ఈ విషయాన్ని తీసుకువెళ్లినా.. తమదే విజయమని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.
This post was last modified on January 12, 2026 8:37 pm
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…