Political News

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణా రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు.

ప్రతీ ఏటా 3 వేల టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తోంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇవ్వటం ద్వారా శ్రీశైలంలోని నీటిని పొదుపు చేసి రాయలసీమకు ఇస్తున్నాం అని తెలిపారు. నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉందన్నారు.

ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్ కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు నేనెప్పుడు అడ్డు చెప్పలేదు. రెండు తెలుగు రాష్ట్రాలూ గోదావరి జలాలను సమర్ధంగా వినియోగించుకోవచ్చు.. పుష్కరాల్లోగా పోలవరం ప్రాజెక్టును నిర్మించి జాతికి అంకితం చేస్తాం అని చంద్రబాబు పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.10,090 కోట్లు జమ చేశామని తెలిపారు. అలాగే స్త్రీశక్తి కార్యక్రమం కింద మహిళలు 3.5 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు, ఇందుకోసం ఇప్పటివరకు రూ.1,114 కోట్లు వ్యయం చేసినట్లు వెల్లడించారు.

అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 46 లక్షల మంది రైతులకు రూ.6,310 కోట్లు అందించామని, దీపం 2.0 కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసి రూ.2,684 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలోనే రూ.50 వేల కోట్ల సామాజిక పెన్షన్లు అందించి సంక్షేమంలో కొత్త మైలురాయిని సాధించామని, ఇప్పటివరకు 70కు పైగా పెద్ద పథకాలు, కార్యక్రమాలు అమలు చేశామని సీఎం తెలిపారు.

This post was last modified on January 12, 2026 6:14 pm

Share

Recent Posts

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

7 minutes ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

20 minutes ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

5 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

7 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

8 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

9 hours ago