Political News

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2 కోట్లను విడుదల చేసింది. రాజధాని ప్రాంతం ఒకప్పుడు బౌద్ధులకు ఆరామంగా ఉండేది. అనేక బౌద్ధ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిగాయి.

ఈ నేపథ్యంలో 2014 నుంచి 2018 మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ‘జ్ఞాన బుద్ధ’ పేరుతో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో బౌద్ధ ఆరామానికి సంబంధించిన అనేక విశేషాలతో పాటు బుద్ధుని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చుట్టూ హరిత హారాన్ని నిర్మించాలని కూడా ప్రణాళిక వేశారు.

జ్ఞాన బుద్ధ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి బౌద్ధులను ఆకర్షించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. అప్పట్లోనే ఈ ప్రాజెక్టుకు ఐదు ఎకరాల భూమిని కూడా కేటాయించారు. ప్రస్తుతం ఉన్న 125 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగానే నిర్మించబడింది.

అయితే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కనపెట్టడంతో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. జ్ఞాన బుద్ధ ప్రాజెక్టు కూడా మూలన పడింది. అయినప్పటికీ ఈ ప్రాంతానికి పర్యాటకులు వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనిని పూర్తిస్థాయిలో విస్తరించాలని రాష్ట్ర పర్యాటక శాఖ నిర్ణయించింది.

ఇటీవల దీనికి సంబంధించిన విధి విధానాలను పర్యాటక శాఖ రూపొందించింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా జ్ఞాన బుద్ధ ప్రాజెక్టు అభివృద్ధికి రూ. 1.85 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో ప్రాంగణాన్ని పునరుద్ధరించనున్నారు.

అదేవిధంగా ప్రత్యేక ధ్యాన మందిరం, గ్రంథాలయం, బౌద్ధుని స్మృతులతో కూడిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. దీనిని ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఏటా సుమారు ఐదు లక్షల మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా జ్ఞాన బుద్ధ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.

This post was last modified on January 9, 2026 10:26 pm

Share

Recent Posts

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

2 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

48 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

56 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago