వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు. ఆ పరిస్థితిని తిరిగి గాడిలో పెట్టేందుకు రెండేళ్ల సమయం పట్టిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడంలోనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందని తెలిపారు.
తన పాలనలో చేసిన తప్పుడు పనులను ఇప్పుడు తమపై నెట్టే ప్రయత్నం జరుగుతోందని చంద్రబాబు విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం కింద రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
గత పాలకులు చేసిన విధ్వంసాన్ని సరిచేయడానికే సమయం సరిపోతోందని అన్నారు. కొందరు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. సుస్థిరమైన పాలన ఉంటేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాలను మార్చితే నష్టమే జరుగుతుందని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో గుజరాత్ తరహాలో ఒకే పార్టీ పాలన కొనసాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
వైసీపీ పాలనలో చోటు చేసుకున్న రెవెన్యూ వివాదాలను పరిష్కరించడానికి రెండేళ్లు పట్టిందని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని అన్నారు. 2021లో పూర్తవాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు 2027కి వెళ్లిందని చెప్పారు. అమరావతికీ అదే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేశారని అన్నారు. ప్రజలు ఎన్నికల్లో స్పష్టమైన గుణపాఠం చెప్పినా ఇప్పటికీ అర్థం కావడం లేదని మండిపడ్డారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదంటూ మాట్లాడటం సరికాదని అన్నారు.
నది పక్కన రాజధాని కడుతున్నారంటూ విమర్శలు చేస్తున్నారని, అయితే విజయవాడ, రాజమండ్రి, విశాఖ, ఢిల్లీ, ముంబై, చెన్నై, లండన్ వంటి నగరాలు కూడా నదుల సమీపంలోనే ఉన్నాయని ప్రశ్నించారు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి రాజకీయాలు చేస్తున్నారని జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు.
పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను అడ్డుకుంటూ ప్రజలను భయపెడుతున్నారని అన్నారు. రహదారులు, ఎయిర్‌పోర్టులు పీపీపీ ద్వారానే వస్తాయని స్పష్టం చేశారు. బోగాపురం ఎయిర్‌పోర్టును ప్రభుత్వం పూర్తి చేస్తుంటే తనదే అంటూ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వానికి పేరు వస్తుంటే భరించలేక ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బోగాపురం పీపీపీ అయితే ఒప్పుకుంటారు, అదే పీపీపీ కింద మెడికల్ కాలేజీలు కడితే వద్దంటున్నారని ఎద్దేవా చేశారు.
This post was last modified on January 9, 2026 6:11 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…