తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మూసీ నదీ ప్రక్షాళనపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభాధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ నదీ ప్రక్షాళన జరిగి తీరాల్సిందేనని అన్నారు.
సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీరు ప్రవహించాల్సిందేనని తేల్చి చెప్పారు. అందుకే, ప్రపంచ స్థాయిలో కన్సల్టెన్సీ నిపుణులతో చర్చించి, మూసీ వంటి ప్రాజెక్టులను పరిశీలించి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని అన్నారు.
గత పాలకులకు నిజాం మీద కోపం ఉంటే అభ్యంతరం లేదని, కానీ, వాళ్లు చేసిన అభివృద్ధిని కాలగర్భంలో కలిపేశారని అన్నారు. నిజాం కట్టిన చారిత్రక కట్టడాలను, అభివృద్ధిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల కిందటే నిజాం నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రాలుగా తీర్చిదిద్దారని, అప్పట్లోనే ప్రపంచ దేశాలతో పోటీ పడేలా హైదరాబాద్ రాష్ట్రాన్ని డెవలప్ చేశారని గుర్తు చేశారు.
అయితే, రేవంత్ మాట్లాడిన తర్వాత తమకు మాట్లాడే అవకాశమివ్వాలని బీఆర్ఎస్ సభ్యులు కోరారు. అందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అనుమతించలేదు. ఆ అంశానికి సంబంధించి మాట్లాడతానంటేనే మైక్ ఇస్తానని, ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే మైక్ ఇవ్వబోనని తేల్చి చెప్పేశారు. దీంతో, స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరుకు నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.
This post was last modified on January 2, 2026 3:20 pm
అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామానికి ఒక శాపమో, దెయ్యమో ఆవహించి ఉంటుంది. దాన్ని వదిలించాలంటే హీరో రంగంలోకి…
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఒక క్రికెట్ మ్యాచ్ ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది. ఆటలో ఒక ప్లేయర్ హెల్మెట్…
ఏపీకి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రానున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కంబ్యాక్ మూవీగా షూటింగ్ మొదలైనప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ మోస్తున్న స్లమ్ డాగ్ ( ప్రచారంలో…
బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. అభిమానులు ప్రేమగా హీమ్యాన్ అని పిలుచుకునే ధర్మేంద్ర చివరి…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మూసీ నది ప్రక్షాళనపై వాడీవేడి చర్చ జరిగింది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన…