ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను మరో రెండు జిల్లాలు కలుపుతూ.. 28 జిల్లాలుగా ఏర్పాటు చేయనుంది. ఈ నిర్ణయం నూతన సంవత్సరం 2026, జనవరి 1వ తేదీ నుంచే అమలులోకి రానుంది. వీటిలో మదనపల్లె, పోలవరం రెండు కొత్త జిల్లాలను జోడిస్తున్నారు.
మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేయడం వరకు బాగానే ఉంది. ఎందుకంటే.. దీనిలో మొత్తం 22 మండలాలు రానున్నాయి. పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లె, రాయచోటి, మదనపల్లె నియోజకవర్గాలలోని 20 మండలాలను మరో రెండు మండలాలతో కలిపి కొత్తగా మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు.
అయితే.. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలవరంపైనే అందరికీ పలు సందేహాలు వున్నాయి. దీనికి కారణం.. ఇది ఏర్పాటు కావడంతో రాష్ట్రంలో అతి చిన్న జిల్లాగా పోలవరం గుర్తింపు తెచ్చుకోనుంది. ఇప్పటి వరకు ఉన్న జిల్లాల్లో పోలవరమే అతి చిన్న జిల్లా కానుంది.
దీనిలో పోలవరంలోని కొన్ని మండలాలు సహా.. ప్రస్తుతం ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గాన్ని విభజించి.. కొన్ని మండలాలను కలుపుతూ.. మొత్తంగా 12 మండలాలతో పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం జనాభా 3 లక్షల 24 వేల మంది మాత్రమే ఉంటారు. ఇతర జిల్లాలతో పోల్చుకుంటే.. ఇది చాలా చిన్న జిల్లాగా మారనుంది.
రీజనేంటి?
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నందున.. కొత్తగా జిల్లా ఏర్పాటు చేస్తున్నారన్న వాదన ఉన్నప్పటికీ.. ప్రభుత్వం దీనిని తోసిపుచ్చింది. అందుకే.. పొరుగున ఉన్న రంపచోడవరం నియోజకవర్గంలోని మండలాలు తీసుకువచ్చి.. దీనిలో కలుపుతూ.. కొత్తగా జిల్లాను ఏర్పాటు చేసింది.
తద్వారా.. గిరిజన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లాగా ఇది ఏర్పడుతుంది. దీంతో కేంద్రం నుంచినిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అదేసమయంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు ఇస్తుంది.
ప్రస్తుతం పోలవరం.. జిల్లాగా ఏర్పడితే.. వెనుకబడి జిల్లాల జాబితాలో పోలవరం ముందు వరుసలోకి వస్తుంది. దీంతో కేంద్రం నుంచి నిధులు మరిన్ని వస్తాయన్న అంచనా ఉంది. ఈ కారణాలతోనే.. పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు.
ఒకవైపు ప్రాజక్టును పరుగులు పెట్టించడంతోపాటు.. ఇక్కడ అభివృధ్ధి పనులు చేపట్టేందుకు కూడా అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే.. కొందరు మంత్రులు ఇంత చిన్న జిల్లా ఏర్పాటు అవసరమా? అని ప్రశ్నించినప్పటికీ.. చంద్రబాబు జిల్లా ఏర్పాటుకే మొగ్గు చూపించారు. ఇవి.. జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
This post was last modified on December 31, 2025 7:46 am
ముందు ‘వానర’ అనే పేరుతో తెరకెక్కి.. రిలీజ్ ముంగిట ‘వనవీర’ అని పేరు మార్చుకుంది ఓ సినిమా. అవినాష్ అనే…
భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు నూతన గేమ్‌చేంజర్ కానుంది. విజయనగరం భోగాపురంలో నిర్మాణమైన అంతర్జాతీయ విమానాశ్రయం చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. 2026…
లోకల్ వెర్సస్ నాన్ లోకల్ గొడవలు దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల వాళ్లు తమ ఉపాధిని దెబ్బ…
సాధారణంగా.. ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వస్తాయి. కానీ.. ఏపీ విషయాన్ని గమనిస్తే.. 2025లో మెజారిటీ పార్ట్ అంతా కూడా.. పెట్టుబడుల…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను రెచ్చగొట్టాలని కొన్ని శక్తులు చూస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత,…
నూతన సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ.. 2025కు వీడ్కోలు చెబుతూ.. నిర్వహించుకునే కార్యక్రమాల్లో మందు బాబులు రెచ్చిపోవడం ఖాయం. ముఖ్యంగా…