సంక్రాంతి పండుగ…తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ. అందుకే, ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో పండుగ చేసుకునేందుకు సొంతూళ్లకు పయనమవుతుంటారు.
ముఖ్యంగా, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు లక్షలాది మంది వెళుతుంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతి సమయంలో హైదరాబాద్ ఖాళీ అయిందా అన్న రీతిలో ట్రాఫిక్ అంతా విజయవాడవైపు మళ్లుతుంది.
దీంతో, ఎల్బీ నగర్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతాలతో పాటు విజయవాడ వెళ్లే రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. వేల కొద్దీ వాహనాలు గంటల కొద్దీ బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది.
ట్రాఫిక్ ను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పండుగ రోజుల్లో రోడ్లపై భారీ యంత్రాలతో చేపట్టే పనులు, లేన్ లు మూసివేసే పనులు నిలిపివేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆయన సూచించారు.
ఒకవేళ అత్యవసరంగా చేయవలసిన మరమ్మతులు, పనులు ఉంటే ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో చేసుకోవాలని ఆదేశించారు. దాంతోపాటు రోడ్లపై హై విజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, వాహనాలు వెళ్లవలసిన దారిని స్పష్టంగా చూపించాలని చెప్పారు.
పండుగ మొదలవ్వడానికి ముందే రోడ్లపై మట్టి, మెటీరియల్, నిర్మాణ సామాగ్రి, యంత్రాలను పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులను మోహరించాలని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
This post was last modified on December 30, 2025 5:03 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…