Political News

చాగంటి తర్వాత మంతెన… చంద్రబాబు మార్క్

జగన్ హయాంలో ప్రభుత్వ సలహారులను లెక్కకు మించి నియమించారని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా నియమించిన సలహాదారుల్లో మెజారిటీ సలహాదారులు రాజకీయాలకు సంబంధించిన వారే ఉన్నారని, జగన్ సన్నిహితులను సలహాదారులుగా నియమించుకున్నారని ఆరోపణలు వచ్చాయి.

అయితే, కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సమాజ హితం కోరి ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులను ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తోంది. 

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావును ఏపీ ప్రభుత్వ విద్యార్థులు, నైతిక విలువల సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. అంతేకాదు, ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ కోవలోనే తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డా.మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వం నియమించింది.

ఏపీ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు నేచురోపతి సలహాదుడి పదవిలో డా.మంతెన సత్యనారాయణ రాజు కొనసాగనున్నారు. ప్రకృతి వైద్యం, యోగాసనాల ద్వారా ప్రజలకు నేచురోపతి వైద్యాన్ని మంతెన రెండు దశాబ్దాలుగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఎండోమెంట్స్ సలహాదారుడిగా పోచంపల్లి శ్రీనివాస్ ను ప్రభుత్వం నియమించింది.

This post was last modified on December 29, 2025 10:58 pm

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

18 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago