తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. మేకను నరికి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫొటోకు అభిషేకం చేశారు. మేక తలకాయ పట్టుకుని వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు.
రాజకీయ ముసుగులో జగన్ యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారని అమరావతి ఎన్టీఆర్ భవన్ లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. జంతు బలిలో పాల్గొన్నవారు ఇప్పుడు రిమాండ్‌లో ఉన్నారు.. ఫ్యాక్షన్ సినిమా చూసినట్లుగా వైసీపీ వికృత చేష్టలు చేస్తోందని మండిపడ్డారు. జగన్ ఆదేశాలతోనే ఈ తరహా కార్యక్రమాలు జరిగాయా? అని ప్రశ్నించారు. గర్భిణీని కాలుతో తన్నే ఉన్మాదులను ఏమనాలి అన్నారు. రాజకీయ ముసుగులో రౌడీయిజం అడ్డం పెట్టుకుని కుట్ర జరుగుతుందని, తల్లిదండ్రులు యువత భవిష్యత్తుపై ఆలోచన చేయాలన్నారు.
రప్పా రప్పా డైలాగులు టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర ఆరోపణలకు దారి తీసాయి. అధికారంలో ఉంటే పీకలు కోయడం, దాడులు చేయడాన్ని జగన్ ప్రోత్సహిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అధికారం పోయాక కూడా రప్పా రప్పా గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్టు నరికితే తప్పేంటి అంటున్నారు.
హింసను, దాడులను అధినేత ప్రోత్సహిస్తుండడంతో, వైసీపీ శ్రేణులు గంజాయి మత్తులో మారణాయుధాలతో రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నారని మండిపడ్డారు.
This post was last modified on December 27, 2025 11:45 pm
బాల నటుడిగా మంచి పేరు సంపాదించిన వాళ్లందరూ హీరోలు నిలదొక్కుకుంటారనేమీ లేదు. కానీ తేజ సజ్జ మాత్రం హీరోగా మంచి…
దండోరా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ హీరోయిన్ల వస్త్రధారణ గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం…
మాములుగా ప్రభాస్ ఎంత తన స్వంత సినిమా ఈవెంట్ అయినా సరే తక్కువగా మాట్లాడ్డం చాలాసార్లు చూశాం. స్వతహాగా తనలో…
హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వేడుక జరిగిన మైదానం కొంచెం చిన్నదే అయినప్పటికీ వేలాదిగా…
హైదరాబాద్‌లోని గండిపేట ప్రాంతంపై తనకు ఎంతో మక్కువ ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. గండిపేటలో ఒకప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం…
ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి స్టేజ్ మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం, ఛాలెంజ్‌లు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది. థియేటర్లకు…