బీఆర్ ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు వరకు ఒక కథ.. రేపటి నుంచి మరో కథ.. అంటూ .. ఏకకాలంలో అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును కూడా హెచ్చరించారు. జలాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. “రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. దద్మమ్మ ప్రభుత్వం(కాంగ్రెస్) మాదిరి మేం చూస్తూ కూర్చోలేం. ఉద్యమిస్తాం. ఊరూ వాడా ఏకం చేస్తాం. అందరినీ కదిలిస్తాం.“ అంటూ.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు గుప్పించారు. తాజాగా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
ప్రధానంగా పాలమూరు జిల్లాపై ఫోకస్ చేసిన ఆయన.. తాజాగా పార్టీ నాయకులతోనూ ఇదే విషయంపై చర్చించానన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణకు ద్రోహం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి వచ్చే నీళ్లలో వాటాను తెగ్గోసుకుంటూ.. అన్యాయం చేయడం లేదా? అని నిలదీశారు. గోదావరిలో 40టీఎంసీల వాటా చాలని కేంద్రానికి ఎలా లేఖ రాస్తారని పేరు ఎత్తకుండానే సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కారును దద్దమ్మ ప్రభుత్వంగా అభివర్ణించిన కేసీఆర్.. తెలంగాణ ప్రజల గొంతులు ఎండుతున్నా.. పొలాలు బీళ్లవుతున్నా.. సోయిలేకుండా పోయిందని దుయ్యబట్టారు.
సమయం ఇచ్చాం..
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాల్సినంత సమయం ఇచ్చామని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కానీ, రాష్ట్ర ప్రయోజనాలకు గండికొట్టేలా వ్యవహరిస్తుంటే.. కడుపు రగిలిపోతోందన్నారు. “పాలమూరు ప్రజలు ఏం అన్యాయం చేశారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇక, ఉద్యమం చేపట్టక తప్పదు. ఇప్పటి వరకు చాలానే సమయం ఇచ్చాం. ఇక, వేచి చూసేది లేదు. మౌనంగా ఉండేది కూడా లేదు“ అని కేసీఆర్ స్పష్టం చేశారు. “ఇవాళ్టి వరకూ ఒక కథ..రేపటి నుంచి మరో కథ.“ అంటూ.. తనదైన శైలిలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం.. ప్రజల కోసం ఎందాకైనా పోరాడుతామన్న ఆయన వెనక్కి తగ్గేదేలేదన్నారు. ఎవరితోనూ.. మొహమాటాలు కూడా పోయేది లేదని చెప్పారు.
This post was last modified on December 21, 2025 10:42 pm
అపర కుబేరుడు.. బహుళ వ్యాపారాల దిగ్గజ పారిశ్రామిక వేత్త.. ఎలాన్ మస్క్‌కు భారీ ఎదురు దెబ్బ తగలనుందని అంతర్జాతీయ మీడియా…
కూలీలో నాగార్జున విలన్ గా నటిస్తారని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించినప్పుడు అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. చాలా వయొలెంట్ గా…
వైసీపీ అధినేత జగన్.. తన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల మధ్య దాదాపు అందరికీ తెలిసి.. మూడున్నరేళ్లకుపైగానే…
ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాటలు విని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమకు అన్యాయం…
మాములుగా ఎంత స్టార్ హీరో అయినా ఫ్లాప్ టాక్ వస్తే నిలదొక్కుపోవడం చాలా కష్టం. కానీ అఖండ తాండవం 2కి…