ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంతం నెగ్గింది. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పోరాటం ఫలించలేదు. చివరకు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లే ఆమోదం పొందింది.
యూపీఏ 1 ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చుతూ ఇటీవల మోడీ సర్కారు పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. మొదటగా మహాత్మా గాంధీ పేరును తొలగించి పూజ్యబాపూజీ పేరు పెట్టాలని ఆలోచించారు. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో, పూర్తిగా పథకానికే కొత్త పేరు పెట్టే విధంగా బిల్లును తీసుకొచ్చారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాల చివరి మూడు రోజులు ఈ అంశం పెద్ద వివాదంగా మారింది. పార్లమెంటు లోపలే కాకుండా బయట కూడా కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు ధర్నాలు మరియు నిరసనలతో హోరెత్తించారు. అంతేకాదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆదివారం కూడా నిరసనలు చేపట్టారు.
ఆదివారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్న సమయంలోనే, హైదరాబాద్ లో శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్రపతి భవన్ ఆదివారం సాయంత్రం విడుదల చేసింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీజీ రామ్ జీ) అనే కొత్త పేరు పెట్టారు.
గ్రామీణ ప్రాంతాలపై గాంధీకి ఉన్న ప్రేమను గుర్తుచేస్తూ ఆయన పేరుతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలో భాగంగానే ఈ పేరు మార్పు అవసరమైందని బీజేపీ నేతలు వివరణ ఇస్తున్నారు. పార్లమెంటులో బిల్లుకు వేగంగా ఆమోదం లభించగా, తాజాగా రాష్ట్రపతి కూడా సంతకం చేయడంతో మోడీ పంతమే నెగ్గింది.
ఏంటి లాభం
— పాత పథకం ప్రకారం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏటా 100 రోజుల పని కల్పించేవారు.
— కొత్త వీబీజీ రామ్ జీ చట్టం ద్వారా ఏటా మరో 25 రోజులు అదనంగా కలిపి మొత్తం 125 రోజుల పని కల్పిస్తారు.
— పాత చట్టం ప్రకారం కేంద్రం 90 శాతం నిధులు ఇవ్వగా, రాష్ట్రాలు 10 శాతం భరించేవి.
— కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాలి.
— గతంలో రోజువారీ వేతనం రూ.150 నుంచి రూ.180 మధ్యలో ఉండేది.
— కొత్త చట్టం ప్రకారం రోజువారీ వేతనం రూ.240కు పెంచారు.
— ఖర్చు చేసే ప్రతి పైసాతో శాశ్వత ఆస్తులు సృష్టించాలన్న నిబంధనను కూడా కొత్త చట్టంలో చేర్చారు.
This post was last modified on December 21, 2025 7:02 pm
వరల్డ్ కప్ అనగానే అందరూ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ గురించే హైప్ ఎక్కించుకుంటారు. కానీ అసలు సినిమా గ్రూప్ స్టేజ్…
ఏపీ రాజకీయాలను ఫాలో అవుతున్న వారికి బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏపీలో…
బీఆర్ ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో సమావేశం నిర్వహించారు.…
బొంబాయి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో మైలురాయిలా నిలిచిపోయిన చిత్రాల్లో ఇదొకటి. 90వ దశకంలో ‘రోజా’తో సంచలనం రేపాక, ‘బొంబాయి’ మూవీతో…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో, అతి పెద్ద స్టార్లలో ఒకడైన ధర్మేంద్ర ఇటీవలే కాలం చేశారు. ‘షోలే’…
నిన్నటి నుంచి అందరూ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ గురించే మాట్లాడుకుంటున్నారు. వైస్ కెప్టెన్ రేంజ్ లో ఉన్న శుభ్మన్…