ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. క్రికెటర్లు, కోచ్‌లు, సహాయక బృందంతో కలిసి జరిగిన ఈ సమావేశంలో ఆయన ఉదారంగా బహుమతులు ప్రకటించారు.
ప్రతి క్రికెటర్‌కు రూ.5 లక్షలు, ప్రతి కోచ్‌కు రూ.2 లక్షలు చొప్పున మొత్తం రూ.84 లక్షల చెక్కులను అందజేశారు. అదనంగా పట్టు చీరలు, శాలువాలు, జ్ఞాపికలు, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ ప్యాక్‌లు అందించి వారికి ఘన సన్మానం చేశారు.
మహిళా అంధ క్రికెటర్ల విజయం దేశానికి గర్వకారణమని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న అవసరాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా వివరించి, వారి సహకారం పొందేందుకు తానుండే ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రికెటర్లు తెలిపిన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెంటనే తీసుకువెళ్తానని చెప్పారు. ప్రపంచ కప్ జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపిక (కెప్టెన్), పాంగి కరుణ కుమారి ఉండటం ఆనందకరమని తెలిపారు.
ఈ సందర్భంగా కెప్టెన్ దీపిక తమ గ్రామ సమస్యలను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా హేమావతి పంచాయతీ తంబలహట్టి తండాకు రహదారి అవసరం ఉన్నట్లు ఆమె విజ్ఞప్తి చేయగా, తక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన కరుణ కుమారి తెలిపిన సమస్యల పరిష్కారానికి కూడా వెంటనే చర్యలు ప్రారంభించాలని సూచించారు.
This post was last modified on December 12, 2025 8:54 pm
తెలుగులో చాలా వేగంగా అగ్ర కథానాయికగా ఎదిగి.. కొన్నేళ్ల పాటు ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్. కానీ వరుస…
ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఒక్కోసారి రీ రిలీజులకు సరైన స్పందన రాదు. కొన్ని మాత్రం ఏకంగా రికార్డులు సాధించే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పలు వీడియోలు.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు ముగింపు లేని కథగా మారుతోంది. అఖండ 2 జిఓని రద్దు చేస్తూ నిన్న హైకోర్టు…
గత వారం విడుదలైన దురంధర్ స్టడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 లాంటి క్రేజీ రిలీజ్ ఉన్నా సరే…
రాజకీయాల్లో తప్పులు చేయడం సహజం. వాటిని సరిదిద్దుకునేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు నడవడం కీలకం!. ఇది కేంద్రం నుంచి రాష్ట్రం…