Movie News

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు. ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనే తన ట్యాగ్ అతిశయోక్తిలా ఏమీ అనిపించదు. నిజంగానే తన సినిమాలు భలే వినోదాన్ని పంచుతున్నాయి.

గత ఏడాది ‘సింగిల్’ పెద్ద హిట్టయింది. ఈ వారం రాబోతున్న ‘విష్ణు విన్యాసం’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఐతే తాను హీరోగా నటించిన సినిమాల కంటే.. చిన్న క్యారెక్టర్ రోల్ చేసిన సినిమా తనకు ఒక రాష్ట్రంలో మంచి గుర్తింపు తెచ్చిందంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించాడు శ్రీ విష్ణు. ఆ చిత్రమే.. సన్నాఫ్ సత్యమూర్తి. 

ఇందులో శ్రీ విష్ణు.. అల్లు అర్జున్ ఫ్రెండు పాత్ర చేశాడు. టాలీవుడ్లో బాగా పేరుమోసిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘శ్రేయాస్ మీడియా’ను ఈ సినిమాలో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థగా చూపించారు. దాని అధినేత పాత్రలో శ్రీ విష్ణు భలే వినోదాన్ని పంచాడు.

తన మీద తక్కువ సీన్లే ఉంటాయి కానీ.. అవి ఫన్నీగా ఉంటాయి. బన్నీకి సాయం చేసినట్లే చేసి.. తనకు కాలేజీ రోజుల్లో అతను చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకునే పాత్రలో కనిపిస్తాడు శ్రీ విష్ణు. అప్పటికే హీరోగా చిన్న సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో చిన్న క్యారెక్టర్ రోల్ చేయడం ఆశ్చర్యమే. 

ఈ చిన్న పాత్రే తనకు కేరళలో ఊహించని గుర్తింపు తెచ్చిపెట్టిందని శ్రీ విష్ణు తెలిపాడు. తాను కేరళకు వెళ్తే చాలామంది గుర్తుపట్టి పలకరించడం చూశానని.. తాను అంత పాపులర్ ఎలా అయ్యానో తనకు ముందు అర్థం కాలేదని శ్రీ విష్ణు తెలిపాడు.

తర్వాత వాళ్లు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా గురించి ప్రస్తావించడంతో షాకయ్యానని అతను చెప్పాడు. చేసింది చిన్న పాత్రే అయినా పరాయి రాష్ట్రంలో తనకు అంత గుర్తింపు తెచ్చిపెట్టడం ఆశ్చర్యమని.. ఇది తన కెరీర్లో ఒక మరుపురాని అనుభవమని.. అందుకే తనకు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మెమొరబుల్ మూవీ అని శ్రీ విష్ణు తెలిపాడు.

This post was last modified on February 24, 2026 4:10 pm

Share

Recent Posts

నయనతారకిది ఊహించని అవమానమే

దీపావళి పండగ సందర్భంగా వంద కోట్ల బొమ్మగా ప్రచారం చేసుకుని విడుదలైన మూకుతి అమ్మన్ 2 (మహాశక్తి) దారుణంగా బోల్తా…

1 hour ago

500 కోట్ల రాజ్యంలో రఘురాముడి విహారం

కొన్ని నెలల క్రితం నెగటివిటీని మోసుకుని టీజర్ ట్రైలర్ టైంలో విమర్శలను చవి చూసిన రామాయణ అంచనాలకు మించి బాక్సాఫీస్…

1 hour ago

రజిని కమల్ ఎంతటి తెలివైనవాళ్ళో

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా గతంలో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

4 లక్షల మందికి విందు… గుర్రపు స్వారీలు

చెన్నైలో అంగరంగ వైభోగంగా జరిగిన వై ఎస్ అనిల్ కుమార్ రెడ్డి కూతురి వివాహం మరిచిపోక ముందే బీహార్లో ఓ…

3 hours ago

వైసీపీ బ‌లం త‌గ్గిందా? పెరిగిందా?

గ‌త 2019 ఎన్నిక‌ల‌తో పోల్చుకుంటే.. 2024 నాటికి వైసీపీకి కేవ‌లం 11 స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. ఆ త‌ర్వాత‌.. జ‌రిగిన…

8 hours ago

రామాయణతో కాజల్ కి దక్కిందేమి లేదు..!

ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన నటి కాజల్ అగర్వాల్. వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే.. సినిమాలకు…

12 hours ago