రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అడ్డంగా దొరికిపోయింది. అతను పార్టీకి ఏమాత్రం సంబంధం లేదంటూ ప్రకటన చేసిన వెంటనే..“జగనన్న నా దేవుడు… ఆయన లేకపోతే నేను ఇప్పటికీ జైలులో ఉండేవాడిని” అని అనిల్ చేసిన వ్యాఖ్యలు, గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తమ కోసం వైసీపీ లాయర్లు పనిచేశారని, తన వెనక వైయస్ జగన్ నూటికి నూరు శాతం నిలబడ్డారని ఆయన తెలిపిన పాత వీడియోలు బయటకు రావడంతో, అనిల్–వైసీపీ మధ్య ఉన్న అనుబంధంపై నెటిజన్లు చర్చిస్తున్నారు.
రెండు వారాల కిందట హైదరాబాదులో జరిగిన జగన్ కోర్టు హాజరు ర్యాలీలో అనిల్ ప్రత్యక్షమై, వైసీపీ తరఫున మాట్లాడినట్లు వ్యాఖ్యానించడం అందరికీ గుర్తుండగానే, తాజాగా సంబంధం లేదని చెప్పడం రాజకీయ వర్గాల్లో హాస్యాస్పదంగా మారింది. ఈ నిర్ణయం రెండు మూడు ఏళ్ల కిందట తీసుకుని ఉంటే మంచిదని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి.
బోరుగడ్డ అనిల్ వ్యవహారం కారణంగా వైసీపీకి జరిగిన నష్టం ఎక్కువే అని విమర్శకులు అంటున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఒక్క ప్రకటనతో అతనితో సంబంధం లేదని చెప్పుకోవడం పార్టీకి మాత్రమే సాధ్యమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తులపై ఇతర పార్టీల్లో వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకునేవారన్నారు రాజకీయ పరిశీలకులు.
గత వైసీపీ ప్రభుత్వంలో అనిల్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఏకంగా చంద్రబాబునే చంపేస్తా అంటూ బెదిరించాడు. జగన్ ఓడిపోయిన తర్వాత కొంతకాలం అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత కూడా వార్తల్లో నిలిచారు.
బెయిలు కోసం తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారని కేసు కూడా నమోదయింది. అతనికి పోలీస్ స్టేషన్లో రాచ మర్యాదలు చేశారనే వీడియో బయటకు రావడంతో ఆ ఘటనకు సంబంధించిన పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఎన్ని జరుగుతున్నా మౌనంగా ఉన్న వైసిపి.. ఇప్పుడు అతనిపై ప్రకటన చేయటం వెనుక ఆంతర్యం ఏమిటో అనే చర్చ ఏపీలో జరుగుతోంది.
This post was last modified on December 11, 2025 10:25 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…