అమెరికాలో ప్రఖ్యాత శాన్ ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. విదేశీ పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం ఆయన శాన్‌ఫ్రాన్సిస్కోకు చేరుకున్నారు. తొలుత ఆయన పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. అమరావతి సహా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వారిని కోరారు. ఏపీ అభివృద్ధి బాటలో పురోగమిస్తోందని.. ఇప్పటికే పలువురు పెట్టుబడి దారులు వస్తున్నారని, ఒప్పందాలు కూడా జరిగాయని ఆయన వివరించారు. ముఖ్యంగా ఎన్నారైలతో నారా లోకేష్ భేటీ అయి .. పెట్టుబడులపై చర్చించారు.
విశాఖలో డేటా కేంద్రం వచ్చినట్టు నారా లోకేష్ వారికి తెలిపారు. దీనివల్ల లక్ష మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా అమెరికాలో క్వాంటమ్ వ్యాలీకి కూడా శ్రీకారంచుట్టామన్నారు. పర్యాటకంగా, పారిశ్రామికంగానే కాకుండా.. ఐటీ పరంగా కూడా రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుబడులకు మరిన్ని అవకాశాలు ఏర్పాడ్డాయని తెలిపారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. అమరావతి రాజధానిలో భారీ భూమి అందుబాటులో ఉందన్నారు. పెట్టుబడులతో వచ్చే వారికి అన్ని విధాలా సహకారం అందిస్తామని వివరించారు.
ఐటీ సహా మౌలిక సదుపాయాల కల్పన రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. ఏపీలో డెవలప్ మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డిని కోరారు. అదేవిధంగా ఏపీలో ప్రపంచ సామర్థ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని `జడ్ స్కాలర్` సీఈవో చౌదరిని కోరారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌లో పరిశోధనా రంగంలో చేతులు కలపాలని `సేల్స్ ఫోర్స్` ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ ను కోరారు. ఇలా.. పలువురు పెట్టుబడి దారులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయి పెట్టుబడులపై చర్చించారు.
ఎవరెవరితో బేటీ అంటే..
+ ఐటీ మౌలిక సదుపాయాలపై `ఓప్స్ ర్యాంప్` సీఈవో వర్మతో భేటీ.
+ అమరావతిలో డిజైన్, ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని `ఆటో డెస్క్` చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్‌తో చర్చలు
+ ఎలక్ట్రోలైజర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు `రిగెట్టి కంప్యూటింగ్` సీటీవో డేవిడ్ రివాస్‌తో లోకేష్ చర్చించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates