జాతీయ మీడియాపై వైసీపీకి అకస్మాత్తుగా ప్రేమ ఉప్పొంగిపోయింది. జాతీయ మీడియాలో వచ్చే పలు క్లిప్పింగులను వైసీపీ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తోంది. ఆ పార్టీ సోషల్ మీడియా వాటిని వైరల్ చేస్తుంది.
ఈ రోజు ఏపీలోని ఒక సంఘటన గురించి వైసీపీ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఏకంగా.. 37 జాతీయ మీడియా ఛానళ్లను టాగ్ చేసింది. ఇంత సడన్ గా అంతగా ఎందుకు గుర్తుకు వచ్చాయి అంటే..
కొద్ది రోజుల నుంచి ఇండిగో విమానాల క్రైసిస్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఒక ప్రముఖ జాతీయ చానల్లో చర్చ నడిచింది. అందులో టీడీపీ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్న క్రమంలో ప్రోగ్రాం ను నడిపిస్తున్న జర్నలిస్టు దానిని అడ్డుకున్నాడు. ఇదే ఇప్పుడు వైసీపీకి అస్త్రంగా మారింది. ఆ వీడియో బైట్స్ ను తెగ వైరల్ చేస్తోంది. మంత్రి నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ తమ అనుకూల ఛానెల్ లో డిబేట్లు కూడా పెడుతోంది. జాతీయ మీడియా కూటమి నాయకులకు అనుకూలంగా లేదు అన్నట్లు ప్రచారం చేస్తోంది.
ఈ క్రమంలోనే వైసీపీ ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ చేసింది. తిరుపతిలో ఓ యువతిపై రాపిడో డ్రైవర్ లైంగిక దాడి చేసిన ఘటన గురించి అందులో ఉంది. ఇలాంటి ఘోరమైన ఘటనలు ప్రస్తుతం రాష్ట్రంలో భద్రత, బాధ్యతా వ్యవస్థలు ఏ స్థాయికి పడిపోయాయో అంటూ వాపోయింది. ఈ పోస్టుకి జాతీయ మీడియా ట్విట్టర్ అకౌంట్ లను ట్యాగ్ చేసింది.
ఏపీలో జరుగుతున్న పరిణామాలలో జాతీయ మీడియా దృష్టికి తీసుకు వెళ్ళటం కారణమై ఉండవచ్చు. ఏపీలోని కొన్ని మీడియా సంస్థలపై మాజీ సీఎం వైయస్ జగన్ తరచుగా విరుచుకుపడుతుంటారు. తమ విమర్శలు జాతీయ మీడియా అయిన గుర్తిస్తుంది అనే ఆశతోనే వైసీపీ దృష్టి జాతీయ మీడియాపై పడి ఉండొచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates