వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ తీవ్రంగా కుదుపునకు గురైందని సీఎం చంద్రబాబు చెప్పారు. జగన్ దెబ్బకు ఏపీ బ్రాండ్ కదిలిపోయింది. దీనిని మళ్లీ పునరుద్ధరిస్తున్నాం. ఒక వ్యవస్థను ఎంతగా ధ్వంసం చేయాలో అంతా చేశారు. అదే వ్యవస్థను బాగు చేసేందుకు తిరిగి గాడిలో పెట్టేందుకు ఎంతో శ్రమిస్తున్నాం అని వ్యాఖ్యానించారు.
ఒకవైపు గత పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను బాగు చేస్తూనే మరోవైపు కొత్త వ్యవస్థలను తీసుకువస్తున్నామని తెలిపారు. అదే సమయంలో ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రం ఇంకా క్లిష్ట పరిస్థితిలోనే ఉందన్న చంద్రబాబు వైసీపీ హయాంలో జరిగిన దోపిడి నిధుల విధ్వంసం వంటి వాటిని చక్కదిద్దేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని వివరించారు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికి పదిహేడు నెలలుగా వ్యవస్థలను చక్కదిద్దే పనిలో ఉన్నాం. అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అంటే వ్యవస్థలను ఎంతగా దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు అని తెలిపారు.
ఐదు సంవత్సరాల విధ్వంసం కారణంగా రాష్ట్రానికి ఆదాయం ఆగిపోయిందని దీంతో ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెప్పారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు ఇదే సమయంలో కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇంకా కొంత సమయం వేచి చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికిప్పుడు అనుకున్నవి అన్నీ జరిగిపోవని గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వమే ఉన్నా పరిస్థితి ఇలా ఉండేది కాదని తెలిపారు. రాష్ట్రం ఈ దేశానికే ఒక ఆదర్శంగా నిలిచేది అని చెప్పారు.
ఒక్క ఛాన్స్ పేరుతో వచ్చి అన్ని వ్యవస్థలను భగ్నం చేశారని వైసీపీపై మండిపడ్డారు.
This post was last modified on December 8, 2025 7:00 pm
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ వలసదారుల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి.…
మొన్న శుక్రవారం రావాల్సిన అఖండ 2 వాయిదా పడటంతో థియేటర్లు బోసిపోతున్నాయి. ఉన్నంతలో ఆంధ్రకింగ్ తాలూకా, రాజు వెడ్స్ రాంబాయి,…